– మంత్రి కేటిఆర్ స్ఫూర్తితోనే ప్రజాసేవ
– విజయమ్మ పౌండేషన్ ద్వారా ఉచితంగా అంబులెన్స్
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం విలేకరి – రామగుండం నియోజకవర్గం)
గోదావరిఖని, సెప్టెంబర్ 22: 2018 ఎన్నికల్లో విజయం అందించి తనకు పునర్జన్మ నిచ్చిన గడ్డ రామగుండం ప్రజల సేవకే నా జీవితం అంకితమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పునరుద్ఘాటించారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో విజయమ్మ పౌండేషన్ ద్వారా ఉచితంగా అంబులెన్సును అందజేస్తూ ప్రారంభించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేటిఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ అంబులెన్సును ప్రభుత్వాసుపత్రికి అందజేసారు.
ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సూర్తితోనే ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజసేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మరింతగా మెరుగైన సేవలందిం చడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అనారోగ్యాల బారిన పడిన నిరు పేదలను ఆసుపత్రికి తరలించేందుకు ఉచిత అంబులెన్స్ సేవలు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. శ్వాస అందక ఇబ్బందులు పడుతున్నకారోనా బాధితులను ఆసుపత్రికి సరైనా సమయంలో చేర్చి వైద్యం అందించేందుకు, ఇతర ప్రాంతాల్లోని కార్పోరేట్ ఆసుపత్రిల్లో తరలించేందుకు ఎల్లవేళల అందుబాటులో వుంటుదని తెలిపారు. రామగుండం ప్రజలు ఈ అంబులెన్సు సేవలను వినియోగించు కోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడి పెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు పాతపెల్లి లక్ష్మి-ఎల్లయ్య, అడ్డాల స్వరూప-రామస్వామి, కుమ్మరి శ్రీనివాస్, బోడ్డు రజిత-రవీందర్, కల్వచర్ల కృష్ణవేణి భూమయ్య, కాల్వ స్వరూప-శ్రీనివాస్, వెగోలపు రమాదేవి-శ్రీనివాస్, దాతు శ్రీనివాస్, అడ్డాల గట్టయ్య, ర్యాకం శ్రీమతి-వేణు, సాంగటి శంకర్, శంకర్ నాయక్, తాళ్ల అమృతమ్మ-రాజయ్య, నీల పద్మ-గణేష్, బాదె అంజలి- భూమయ్య, కన్నూరి సతీష్ కుమార్, ఎన్.వి. రమణరెడ్డి, అమిరిన్ పాతిమా-సలీం,మంచికట్ల దయాకర్, ఇంజపూరి పులిందర్, అయిత శివకుమార్, దోంత శ్రీనివాస్, కోమ్ము వేణుగోపాల్, జెట్టి జ్యోతి- రమేష్, జంగపల్లి సరోజన – కనుకయ్య,జంజర్ల మౌనిక-రాజు, పాముకుంట్ల భాస్కర్, బాల రాజ్ కుమార్, మేకల సదానందం, ధరణి స్వరూప-జలపతి, పోన్నం విద్య-లక్ష్మన్, గనముక్కుల మహలక్ష్మి-తిరుపతి తానిపార్తి విజయలక్ష్మి, – గోపాల్ రావు, చెరుకు బుచ్చిరెడ్డి, వంగ శ్రీనివాస్ గౌడ్, తస్లీమభాను, జహీపాషా, మహ్మద్ రఫి తదితరులు పాల్గొన్నారు.