Home తెలంగాణ జీఎంలతో సింగరేణి సీఎండీ వీడియో కాన్ఫరెన్స్‌…

జీఎంలతో సింగరేణి సీఎండీ వీడియో కాన్ఫరెన్స్‌…

369
0
Participated CMD video conference
RG-I GM K.Narayana participated in C&MD Video conference

– బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, పంపిణిలపై చర్చించిన సీఎండీ

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్‌ 2: సింగరేణి వ్యాప్తంగా వున్న జనరల్‌ మేనేజర్లతో సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఅండ్‌ఎండీ) నడిమెట్ల శ్రీధర్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎండీ సింగరేణి ఆర్‌జీ-1 ఏరియాలో ఉత్పత్తి, ఉత్పాదకత, 100శాతం బొగ్గు ఉత్పత్తికి తీసుకోవాల్సిన ప్రణాలికలు, నూతన (పాజెక్ట్‌, ఓవర్‌బర్డెన్‌ (మట్టి) తరలింపు, కరోనా నివారణ చర్యలు గురించి చర్చించారు, అర్జీ -1 ఏరియాలో 22,000 నుంచి 25,000 క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ తొలగించాలని,7వేల నుంచి 9వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు. రోజుకు 1.5 రేకుల ద్వారా సగటున నెలకు 45 రేకుల ద్వారా బొగు డిస్పాచ్‌ చేయాలని సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశించారు.

అర్జీ-1 ఏరియా జియం కల్వల నారాయణ మాట్లాడుతూ అండర్‌ (గౌండ్‌ గనులలో బొగ్గు ఉత్పత్తి పెంచామని, గనుల్లో ఉద్యోగుల హాజరు శాతం పెరిగిందన్నారు. జీడికే.11వ గనిలో కంటిన్యూస్‌ మైనర్‌ ద్వారా త్వరలో బొగ్గు ఉత్పత్తి తీస్తామన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు సరఫరా,ఓవర్‌ బర్డెన్‌ తొలగింపు, భూగర్బ, ఉపరితల గనుల మీద యం(తాల వినియోగం తదితర అంశాలపై చర్చించటం జరిగిందన్నారు. అర్జీ-1 ఏరియాలో సెప్టెంబర్‌లో బొగ్గు ఉత్పత్తి 70శాతం జరిగిందని, రానున్న రోజులలో 100 శాతం సాధించాటానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు.

ఓపెన్‌ కాస్ట్‌-5కు సంబంధించి రోడ్లు, (డైనేజి, విద్యుత్‌ లైన్లు, భూసేకరణ పనులు తదితర అనుమతుల పై చర్చించటం జరిగిందని జీఎం పేర్కొన్నారు. అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లలో కరోనా నివారణకు అనేక చర్యలను తీసుకుంటున్నామన్నారు. 38 వేల మాస్కులను ఉద్యోగులకు పంపిణీ చేశామని, ఏరియా హాస్పిటల్‌లో 4588 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు చేశామన్నారు. 243 ఆర్‌.టి.పి.సి.ఆర్‌ పరీక్షలు కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులకు చేశామన్నారు.కాం(టాక్టర్‌ కార్మికులకు కూడా కరోనా పరీక్షలను ఏరియా ఆసుపత్రిలో చేపట్టామని జీఎం నారాయణ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మెడిపల్లి పి.ఒ సత్యనారాయణ, డిజియం ఐ.ఇ.డి ఆంజనేయులు, పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌.రమేశ్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌ హరినాథ్‌, ఎస్‌.ఇ. (ఇఅండ్‌ఎం) దాసరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here