– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, అక్టోబర్ 2 :అహింస సిద్ధాంతాన్ని ఆయుధంగా మలుచుకుని దేశానికి స్వాతంత్య్ర తీసుకొచ్చిన జాతిపిత బాపూజీ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మహత్మగాంధీ జయంతి పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాద్ అసెంబ్లీలో ఆవరణలోని మహాత్ముని విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… బ్రిటిష్ పాలన నుండి భారతమాతకు విముక్తి కలిగించిన మహనీయులు మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. మహత్ముడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని, ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని కోరారు.