– నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకున్న వేడుకలు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనర్, అక్టోబర్ 11: కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా వి.బి. కమలాసన్‌రెడ్డి నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఆదివారంనాడు కమిషనరేట్ కేంద్రంలో వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ కె శశాంక, మున్సిపల్ కమిషనర్ వి. క్రాంతిలు పూలమొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కమిషనరేట్ కేంద్రంలోని లాంజ్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో అడిషనల్ డిసిపి(పరిపాలన), సిటిస్పెషల్‌బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, సిఏఆర్ విభాగాలకు చెందిన అధికారులు పుష్పగుచ్చాలను అందించి కమిషనర్‌తో కేక్‌లను కట్‌చేయించి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ అన్నివిభాగాలకు చెందిన అధికారులు సమర్ధవంతంగా పనిచేస్తుండటం ద్వారానే శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో సఫలీకృతమవుతున్నామన్నారు. ఆరోగ్యకరమైన పోటీని ఏర్పరుచుకుని అధికారులు పరస్పర సహకారంతో ముందుకుసాగుతుండటం వల్లనే సంతృప్తికరమైన ఫలితాలువస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి(పరిపాలన) జి చంద్రమోహన్, ఏసిపి పి అశోక్, ఇన్స్‌పెక్టర్లు తుల శ్రీనివాసరావు, విజయ్‌కుమార్ లక్ష్మణ్‌బాబు, విజ్ఞాన్‌రావు, ఎస్‌బిఐ ఇంద్రసేనారెడ్డి, ఆర్‌ఐలు మల్లేశం, జానిమియా, శేఖర్, మురళి, కమ్యూనికేషన్స్ ఇన్స్‌పెక్టర్ సుధాకర్‌లతోపాటు వివిధ విభాగాలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.