Home తెలంగాణ కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చెందుతున్న మత్స్యరంగం

కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చెందుతున్న మత్స్యరంగం

436
0
MLA speaking
Ramagundam MLA Korukanti Chander speaking at meeting

– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 11: కాళేశ్వరం ప్రాజెక్టుతో అందుబాటులోకి వస్తున్న జలసిరుల ద్వారా మత్స్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మత్స్యకార సహాకార సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఎందరో తమ అత్మబలిదానాలు, ఉద్యమనేతల అలుపెరగని పోరాటంతో పాటు సిఎం కేసీఆర్ అమరణ దీక్ష ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవిర్భావించిదని… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సిఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అన్ని వర్గాల సంక్షేమంతో పాటు కుల వృత్తులకు తగిన ప్రోత్సహం అందిస్తున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి దూరదృష్టి విధానాల మూలంగా ఆరు ఏండ్లలో  తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పధంలోకి దూసుకు పోతుందన్నారు. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంతో రైతులకు సాగు నీరుతో పాటు మత్స్య సంపద పెరిగిందన్నారు. దీంతో బెస్త, ముదిరాజు కులస్థులకు ఉపాధి మార్గాలు మెరుగు పడ్డాయాని తెలిపారు.

రామగుండం ప్రాంతంలోని గోదావరి నదిలో 12లక్షల చేప పిల్లలు, 12లక్షల రోయ్య పిల్లలను వదలడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుండి రామగుండం నియోజ వర్గంలోని మత్స్యకారులకు 92 వలలతో పాటు 25 లగేజీ ఆటోలు, 174 మోపెడ్స్, సంచార చేపల వాహనాలు 9 అందించమన్నారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలో ఉన్న చెరువులను కాపాడి వాటిల్లో చేపలు వదలడం జరుగుతుందని తెలిపారు. చేపలు వృద్ధిచెందితే మత్స్య కారులకు ఉపాధి లభిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో డి.ఎఫ్.ఓ మల్లేశం, కో-ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ధర్మాజీ కృష్ణ, నాయకులు తానిపర్తి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here