Home న్యూస్ 45వ డివిజన్ లో గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ

45వ డివిజన్ లో గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ

566
0
Kommu venu

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 45 వ డివిజన్ లోని అంగన్వాడి కేంద్రంలో గర్భిణి స్త్రీలకు పాలు, కోడిగుడ్లు, బాలామృతం, నూనె, బియ్యం మరియు పప్పులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు పాల్గొని అర్హులైన లబ్దిదారులకు కోడిగుడ్లు, బాలామృతం మరియు పప్పులు అందజేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ కొమ్ము వేణు గారు మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రంలో అందిస్తున్న పౌష్టికాహారంను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలని అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి గర్భిణీ స్త్రీలు బయటికి రావొద్దు అని, ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని కోరారు. అలాగే ప్రతి 10 నిమిషాల ఒకసారి చేతుల్ని శుభ్రం చేసుకోవాలని ప్రతి ఒక్కరు బయటికి వచ్చినపుడు మాస్కులు ధరించాలని తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు , అంగన్వాడీ కార్యకర్తలు మరియు కొమురెల్లి అడ్వకేట్ ,ఎర్రగోళ్ల శ్రీకాంత్ ,మీనుగు సురేష్ పాల్గోన్నారు

ద్వారాకనగర్ లో కూలిన ఇల్లు

45 వ డివిజన్ లో ద్వారాకనగర్ బోర్డ్ దగ్గర గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంగం లక్ష్మణ్ గారి ఇల్లు అర్ధరాత్రి కూలిపోవడం జరిగినది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు వెళ్లి భరోసా కల్పించడం జరిగినది. అలాగే ఇట్టి విషయాన్ని సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలియజేయడం జరిగినది.

kommu venu

వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు ఇంటిని సందర్శించి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది. వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారి రామిరెడ్డి గారికి డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు గారు కృతజ్ఞతలు తెలపడం జరిగినది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here