Home తెలంగాణ పండించిన ప్రతి గింజను కోనుగోలు చేస్తాం-ఎమ్మెల్యే చందర్

పండించిన ప్రతి గింజను కోనుగోలు చేస్తాం-ఎమ్మెల్యే చందర్

498
0
Korukanti chandar
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రామగుండము ఏమ్మెల్యే కోరుకంటి చందర్

తెలంగాణ రైతాంగం కళ్లల్లో ఆనందం నింపడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం అంతర్గాం మండలంలోని ఏ క్లాస్ ఆకెనపల్లి, బ్రాహ్మణపల్లి, ఎల్లంపల్లి, మురుమూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

రాష్ట్రంలోని రైతుల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అపర భగీరథ ప్రయత్నం చేసి కాళేశ్వర ప్రాజెక్టును నిర్మాణం చేశారన్నారు. పంట పొలాలను సాగునీరు అందించి భీడు భూములకు ప్రాణం పోసి రైతుల కష్టాలను తీర్చారన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కోనుగోలు చేస్తామని, రైతులు ఎవ్వరు ఆధైర్యపడవద్దని అన్నారు. కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజనీకం ఆరోగ్య రక్షణతో పాటు ప్రాణాలను కాపాడేందుకు లాక్ డౌన్ ప్రకటించడం జరిగిందన్నారు.

లాక్ డౌన్ కారణంగా అర్ధిక వ్యవస్థ కుప్పకులిపోయిందని, రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవద్దని భావించి మఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా పంటలను కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి రైతు పక్షపాతిగా మారోమారు నిలిచారన్నారు. ప్రతి పంట భూములకు సాగునీరు అందించి పంటపోలాలు పచ్చదనంతో విరాజిల్లి రైతులకు అధిక దిగుబడులు అందించిన రైతు బంధవు సిఎం కేసీఆర్ అని అన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు అందించడంతో పాటు రైతులకు పెట్టుబడి సహాయం అందించి రైతుల ముఖాల్లో అనందం నింపినా పెద్దరైతు సిఎం గారని అన్నారు.

ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు సేంటర్స్ ఏర్పాటు చేస్తామని, ధాన్యంను ప్రభుత్వ నిబంధనాలకు అనుగుణంగా టోకెన్ ఇచ్చిన తర్వాతే రైతులు ధాన్యాన్ని కోనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కారోనా వ్యాప్తి పరిస్థితుల్లో రైతులందరు ధాన్య విక్రయిస్తున్న సందర్భంలో సమాజీక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, ప్రభుత్వ సూచనాలు తప్పకుండా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోజడ్పీటిసి ఆముల నారాయణ, ఎంపిపి దుర్గం విజయ,వైస్ ఎంపిపి మట్ట లక్ష్మి,సహకార సంఘ చైర్మన్ మామిడాల ప్రభాకర్ సర్పంచ్ బండారి ప్రవీణ్ తదిరులు పాల్గోన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here