– వ్యక్తం చేస్తున్న జమ్మికుంట ఓటర్లు…
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రచారం కీలకం
– గత మూడు నెలలగా ఇక్కడే మకాం
– ముగిసిన ప్రచారం
(మా ప్రతినిధి మేజిక్ రాజా)
జమ్మికుంట, అక్టోబర్ 27: హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజక వర్గంలోని ప్రధాన మున్సిపాలిటి అయిన జమ్మికుంటలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి లభించిన విశేష స్పందనే దీనికి తార్కాణం.
ప్రచారం ముగిసింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. గత మూడు నెలలుగా జమ్మికుంటలో మాకాం వేసిన కోరుకంటి చందర్ మున్సిపల్ పరిధిలో ‘గడపగడపకు గులాబీ సైన్యం’ పేరుతో ఇంటింటికి, షాపుషాపుకూ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ ప్రతి ఓటరును కలుసుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించడంలో సఫలీకృతులయ్యారు.
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆరోపిస్తూనే, నల్ల చట్టాలు తెచ్చి, వ్యవసాయం చేసుకుంటున్న రైతులను రోడ్లపైకి తెచ్చారని, ఆ చట్టాలకు వ్యతిరేకంగా, రోడ్లపై శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న రైతులపై దాడులు, హత్యాకాండ చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రత్యర్థి ఈటెలను తనదైన శైలితో విమర్శించారు.
టి.ఆర్.ఎస్ ప్రభుత్వం రైతులను రాజులుగా చేయాలనే ఉద్దేశంతో పెట్టుబడికి సాయంగా రైతుబంధు అమలు చేస్తూ, సాగుకు 24 గంటలు ఉచిత కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి సాగునీరు అందిస్తూ, యేటా రెండు పంటలు తీయడానికి ప్రోత్సహిస్తున్న తీరు, అలాగే పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డుపై సన్న బియ్యం, సిఎంఆర్ఎఫ్ తో పాటు దళితబంధు లాంటి ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న తీరును ప్రజలకు వివరించడంలో సఫలీకృతులయ్యారు.
ఆస్తులను కాపాడుకోవడానికి బీజేపీలో చేరి, అర్ధాంతరంగా ఎన్నికలను తెచ్చిన ఈటెల రాజేందర్ ను చిత్తుగా ఓడించి, ముఖ్యమంత్రి కేసిఆర్ బలపరిచిన టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి సమావేశంపలోనూ పిలపునివ్వడం విశేషం.
కాగా గోదావరిఖని సింగరేణిలో గని కార్మికులుగా పనిచేస్తున్న వారిలో చాలామంది జమ్మికుంట వారే కావడం, దానికి తోడు రామగుండం, గోదావరిఖని ప్రాంతం నుంచి పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తుం డడం, వారి బంధువులు పలువురు జమ్మికుంటలో ఉండడంతో చాలామంది ఎమ్మెల్యే చందర్ ను స్వాగతించారు.
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకంటి చందర్ మీద నమ్మకంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా హాలియా మున్సిపాలిటీ ఇంచార్జిగా బాధ్యతలు అప్పజెప్పగా టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు కోసం ప్రత్యేక వ్యూహరచన చేసి, ఆయన గెలుపులో ప్రధాన భూమిక పోషించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ జమ్మికుంట మున్సిపాలిటీ బాధ్యతలు అప్పగించడంతో కోరుకంటి చందర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుడిభుజంగా వుంటూ సుమారు మూడు నెలల నుండి జమ్మికుంటలోనే మకాం వేసి, తనదైన శైలితో పక్కా వ్యూహ రచనతో ప్రచారం నిర్వహించడంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమనే అభిప్రాయం జమ్మికుంట ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.