Home తెలంగాణ సి.హెచ్.పి.ని సందర్శించిన ఆర్జీవన్ జియం

సి.హెచ్.పి.ని సందర్శించిన ఆర్జీవన్ జియం

544
0
visited CHP
RG-I GM K. Narayana visited CHP

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని సెప్టెంబర్ 4: గోదావరిఖని-1 సి.హెచ్.పి.ని ఆర్జీవన్ జియం కె.నారాయణ శుక్రవారం రోజున సందర్శించారు. ఈ సందర్బంగా జియం మాట్లాడుతూ ఈ రోజు నుండి మేడిపల్లి ఒపెన్ కాస్ట్ హైవాల్ మైనింగ్ (3ఎ సిమ్) నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతున్న ధృష్ట్యా అత్యదిక స్థాయిలో బొగ్గు సి.హెచ్.పి కి రవాణా ద్వారా వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు మరియు ఉధ్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిడికె 1 సి.హెచ్.పి నుండి బొగ్గు రెక్ ల ద్వారా బొగ్గు రవాణా వివరాలను అడిగి తెలుసు కున్నారు. మేడిపల్లి ఒపెన్ కాస్ట్ నుండి వచ్చే బొగ్గు రవాణ మరియు డంపింగ్ చూసుకోవాలని, సి.హెచ్.పి లో మిషనరిని, క్రషర్స్, బెల్టులు తదితర యంత్రాలను ఎప్పటి కప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలని పేర్కొన్నారు. వర్షాకాలం దృష్ట్యా దోమలు ప్రబలే అవకాశం వున్నందున పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సి.హెచ్.పి.లో ఉన్నటువంటి ఇనుప స్ర్కాప్ తీసివేయాలని కోరారు. అందరూ కలిసి కట్టుగా పని చేస్తూ ప్రతి ఒక్కరూ రక్షణ సూత్రములను పాటిస్తూ తమ విధులను నిర్వహించెలా చర్యలను తీసుకోవాలని సి.హెచ్.పి. ఎస్.ఈ (ఈఅండ్ఎం) దాసరి శ్రీనివాస్ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో 1 గ్రూప్ ఏజెంట్ సురేశ్, ఎస్.ఈ (ఈఅండ్ఎం) దాసరి శ్రీనివాస్, ఈ.ఈ. భూస శ్రీనాథ్, పర్సనల్ మేనేజర్ రమేశ్, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here