Home తెలంగాణ కార్యకర్తలే బీఆర్‌ఎస్‌ బలం… బలగం…

కార్యకర్తలే బీఆర్‌ఎస్‌ బలం… బలగం…

1062
0
MLA Korukanti Chander
Ramagundam MLA Korukanti Chander speaking on meeting

` ప్రజా సంక్షేమం కోసమే బీఆర్‌ఎస్‌
` అధికారం కోసమే బీజేపీ, కాంగ్రెస్‌
– రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్‌.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని ఏప్రిల్‌, 9: పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ… భారత రాష్ట్ర సమితికి విజయాన్ని చేకూర్చేది కార్యకర్తలేనని, మా బలం బలగం కార్యకర్తలేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పునరు ద్ఘాటించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు గంగానగర్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆది వారం చేపట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ముందుగా స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీ జంక్షన్‌ నుంచి గంగానగర్‌ లోని ఫంక్షన్‌ హాల్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

MLA Korukanti Chander
MLA Korukanti Chander garlanding the statue of Ambedkar

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర సాధనలో బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు అలుపెరుగని పోరాటాలు చేశారన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత వారికే దక్కుతుందన్నారు. నిబద్ధత కలిగిన కార్యకర్తల కృషితోనే బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిం దన్నారు. పట్టుదల, అంకితభావం కలిగిన కార్యకర్తలతో 60 లక్షల సభ్యత్వానికి బిఆర్‌ఎస్‌ చేరుకుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా నిరుపేద ప్రజానీకం కోసం సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. సమైఖ్య పాలనలో కాంగ్రెస్‌ 60 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఒకప్పుడు తినడానికి తిండి లేకుండా, ఉండటానికి గూడు లేని పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ.. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో సంతోషంగా ఉందన్నారు. పచ్చని పంటలతో, పొలాలతో సస్య శ్యామలంగా విరాజిల్లు తుందన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యంలా ఉందన్నారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

MLA Korukanti Chander
Activists presenting plow to MLA

సీఎం కేసీఆర్‌ గారు అన్ని వర్గాల సంక్షేమం కోసం పరితపిస్తూ, అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తు న్నారని అన్నారు. రాష్ట్రంలో సంపాదన పెంచుతూ.. పేద ప్రజానీకానికి సంపద పంచుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు సాధించి, కార్మికుల పక్షపాతిగా కేసీఆర్‌ నిలిచారన్నారు. కార్యకర్తలు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, వారిని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.

MLA Korukanti Chander
Activists honoring MLA

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశానని, జైలుకు సైతం వెళ్లానని ఎమ్మెల్యే చందర్‌ గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడితే ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఉద్యమంలో పాల్గొన్నానని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చానే తప్ప.. అధికార దాహం కోసం కాదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు అధికారం కోసం వెంపర్లాడుతున్నారని అన్నారు. కష్టించే మనస్తత్వం చిన్ననాటి నుంచే ఉందని, ప్రజాసేవకే తన జీవితం అంకితమన్నారు. ప్రజలకు మంచి చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యకర్తలే బలంగా, బలగంగా ముందుకు దూసుకుపోతున్న భారత రాష్ట్ర సమితి రాబోయే కాలంలో అఖండ విజయం సాధిస్తుందని, విపక్షాల నాయకులకు డిపాజిట్‌ కూడా వచ్చే అవకాశం లేదని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు.

కంటి ముందు ప్రజా ప్రతినిధి-ఇంటి ముందు అభివృద్ధి

Errolla Srinivas
Errolla Srinivas speaking in Atmiya Nammelanam

` తెలంగాణ రాష్ట్ర ఎమ్మెస్‌ ఐడిసి చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

సిఎం కేసీఆర్‌ పాలనలో కంటి ముందు ప్రజా ప్రతినిధి-ఇంటి ముందు అభివృద్ధి కనిపిస్తుందని, దేశమంతా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అతి తక్కువ కాలంలోనే జరుగుతున్న గణనీయమైన అభివృద్ధిని చూస్తోందని, అభివృద్ధి విషయంలో 2014కు ముందు-తర్వాతను మైలు రాయిగా చూస్తోందని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెస్‌ఐడిసి చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం గోదావరిఖని గంగా నగర్‌ లోని జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

గతంలో దాదాపు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలుగానీ, అభివృద్ధి గానీ కంటికి కానరాక పోయేదని, కానీ నేడు ‘కంటి ముందు ప్రజా ప్రతినిధి-ఇంటి ముందు అభివృద్ధి’ గా రాష్ట్ర ముఖ్యమంత్రి కెేసీఆర్‌ నేతృత్వంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ఆసరా, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా ఇక్కడ అసాధ్యాలనుకున్న మెడికల్‌ కాలేజీ, కోర్టు భవన సముదాయం, సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాల యంవంటి శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

BRS Workers and Leaders
BRS workers and leaders who participated in Atmiya Sammelan

అచ్చ వేణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికార ప్రతినిధి రాకేష్‌, రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి, కార్పొరేటర్లు వేగోలపు రమాదేవి, శ్రీనివాస్‌, దాతు శ్రీనివాస్‌, కలువల శిరీష-సంజీవ్‌, జనగామ కవిత సరోజినీ, కో-ఆప్షన్‌ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు పిటి స్వామి, అడ్డాల రామస్వామి, జనగామ నర్సయ్య, తోకల రమేష్‌, జాహేద్‌ పాష, వంగవీరస్వామి, గంజి చక్రపాణి, అడబత్తుల మల్లేష్‌, కొయ్యడ సుధాకర్‌ గౌడ్‌, జనగామ చంద్రయ్య, పిల్లి రమేష్‌, కొల్లూరి బాలయ్య, చిన్నమూల విజయ్‌, కలవేన రవీందర్‌, భీముని కేశవ్‌ గౌడ్‌, సట్టు శ్రీను, వెయ్యిగండ్ల శ్రీను, దామ నరసయ్య, విశాల్‌, ఠాగూర్‌, అరుణ్‌, సాయి, లింగంపల్లి లింగయ్య, పుట్ట రమేష్‌, భీమారపు కోటేశ్వరరావు, పోలాడి శ్రీనివాసరావు, రమేష్‌ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, మున్నా, పెసర స్వామి, మహంకాళి బాబు, గోవర్ధన్‌, సుధాకర్‌ రెడ్డి, తోడేటి శంకర్‌ గౌడ్‌, నూతి తిరుపతి, మెతుకు దేవరాజు, చెలకలపల్లి శ్రీనివాస్‌, కోడి రామకృష్ణ, గోలి నాగేశ్వరరావు, సంధ్యారెడ్డి, లతా మోహన్‌, ఈదునూరి పద్మ తదితరులుతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here