– యుద్దభేరి మహధర్నాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరిక
– అధిక సంఖ్యలో తరలివచ్చిన కార్మికులు, ప్రజలు
– గులాబీ మయమైన గోదావరిఖని ప్రధాన చౌరస్తా
– బొగ్గు బ్లాకుల వేలం వెంటనే ఆపాలి
– బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, ఏప్రిల్, 8: తెలంగాణ కొంగుబంగారమై సింగరేణి జోలికొస్తే ఊరుకోబోమని, సింగరేణి ఉనికిని ప్రశ్నార్థకంగా చేసేలా కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని రామగుండం శాసనసభ్యులు బిఆర్‌ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శనివారం జరిగిన మహాధర్నాలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ నాయకత్వంలో చేెపట్టిన యుద్దభేరి మహధర్నాకు అధిక సంఖ్యలో కార్మికులు, ప్రజలు బీఆర్‌ఎస్ శ్రేణులు తరలివచ్చారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…తెలంగాణ ఆర్థిక, సామాజిక జీవనాడీ అయిన సింగరేణి సంస్థ, అద్భుతమైన అభివృద్ధి ప్రస్థానాన్ని సాగిస్తూ లాభాల్లో నడుస్తుందని, సంస్థకు నష్టాలు చూపించి ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. తెలంగాణకు ఆయువు పట్టు అయిన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్రం కుట్రపన్నుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశంలో సింగరేణి సంస్థ లాభాలు సాధించిందని అన్నారు.
అనతి కాలంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తుందన్నారు. బిఆర్‌ఎస్ పార్టీని స్దాపించిన సిఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో తమకు పోటిగా వస్తారని భావించిన మోడి సర్కార్ కేసీఆర్ అడ్డుకునే ప్రకియలో భాగంగా సింగరేణి సంస్దకు చెందిన నాలుగు బ్లాక్‌లను వేలం వేసి కార్పోరేట్ సంస్ధలకు అప్పగించేందుకు చూస్తుందన్నారు. సంస్థకు చెందిన కె.కె.5, పెనగడప, శ్రావనపల్లి, సత్తుపల్లి నాలుగు బ్లాకుల వేలం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
నరేంద్ర మోడీ గోదావరిఖని ఎన్టీపీసీ బహిరంగసభలో సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయమని కల్లబొల్లి మాటలు చెప్పి సింగరేణి సంస్ద నాలుగు బ్లాకులు వేలానికి పెట్టడం ప్రధాన మంత్రి మోసపూరిత మాటలకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకులను రాష్ట్రానికి కేటాయించాలని పలుమార్లు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా సంస్థను నిర్వీర్యం చేసేందుకు బొగ్గు బ్లాకుల వేలం వేస్తుందని అన్నారు.
రామగుండం గడ్డ మీద ప్రధాని ఇచ్చిన మాట నిలుపుకొకపోవడం సిగ్గు చేటన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరణ చేస్తారు కానీ అధిక ఉత్పత్తి సాదిస్తూ 33 శాతం లాభాల వాట కార్మికులకు ఇస్తున్న సింగరేణి ప్రైవేట్ పరం చేయడంలో మోడీ కుట్రలు కనపడుతున్నాయని విమర్శించారు. గత పాలకులు పోగొట్టిన కారుణ్య నియామకాలు సిఎం కేసీఆర్ అమలు చేస్తూ సింగరేణి కార్మికులను అక్కున చేర్చుకున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల ఉసురు పోసుకుంటున్న మోడికి రాబోవు రోజుల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ టిబిజికెఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్ది, కెంగర్ల మల్లయ్య బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ,్డ జడ్పీటీసీ అముల నారాయణ, కార్పొరేటర్లు ఇంజపురి పులిందర్, పెంట రాజేష్, అడ్డాల స్వరూప రామస్వామి, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణుగోపాల్, కన్నూరి సతీష్ కుమార్, అడ్డాల గట్టయ్య, ఎన్.వి.రమణరెడ్డి, కుమ్మరి శ్రీనివాస,్ శంకర్ నాయక్, కల్వచర్ల కృష్ణావేణి, కవిత, సరోజిని, బాదె అంజలి, బాలరాజ్ కుమార్, నీల పద్మ గణేష్, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, సర్పంచ్‌లు కోల లత, ధరని రాజేష్, ధర్మాజీ కృష్ణా, టీబీజీకేఎస్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు గండ్ర దామ్షెదర్ రావు, అయులి శ్రీనివాస,్ జహిద్ పాషా, వెంకటేష్, నడిపెల్లి మురళిధర్ రావు, తోడేటి శంకర్ గౌడ్, పి.టి. స్వామి, పాతపెల్లి ఎల్లయ్య, పర్లపల్లి రవి, గౌతం శంకరయ్య, జే.వి.రాజు, గంగ శ్రీనివాస్, కాల్వ శ్రీనివాస్, రాకం వేణు, మండ రమేష్, బాలసాని స్వామి గౌడ్, నారాయణదాసు మారుతి, చెరుకు బుచ్చిరెడ్డి, తానిపర్తి గోపాలరావు, కో ఆప్షన్ సభ్యుడు వంగ శ్రీనివాస్ గౌడ్, కల్వల సంజీవ్ చెలుకలపల్లి శ్రీనివాస్, బొడ్డు రవీందర్, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, తోకల రమేష్ అచ్చే వేణు పుట్ట రమేష్ పిల్లి రమేష్ వడ్డెపల్లి శంకర్ చల్లా రవీందర్ రెడ్డి ఆడప శ్రీనివాస్, అల్లం రాజన్న, దొమ్మెటి వాసు, పీచర శ్రీనివాస్, దేవ వెంకటేశం, పోన్నం లక్ష్మన్, విజయ, చంద్రశేఖర్, పి.ఎస్ అమరేందం, జడ్సన్, జిట్టవేన ప్రశాంత్, ఇసంపల్లి తిరుపతి పిల్లి రమేష్ ఇరుగురాళ్ల శ్రావన్ మేకల అబ్బాస్ చింటు గుండు శ్రావన్, బంధే నాగాభూషణం గౌడ్ ప్యారేమీయా శ్రీహరి వడ్డెపల్లి క్రాంతి, ఇనుముల సత్యం, అల్లం ఐలయ్య, గడ్డం నారాయణ, మైస రాజేష్ కొంకటి లక్ష్మన్, సిరాజోద్దీన్, గఫార్ ఇజ్జగిరి భూమయ్య, ఓదేలు, తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.