– రుణం తీర్చుకునేందుకు లబ్దిదారులంతా సిద్ధం
– పట్టణంలో లబ్దిదారుల భారీ ర్యాలీ…
– సాగర్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హాలియా (నాగార్జునసాగర్) మార్చి 23ః దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆదర్శవంత పాలన అందిస్తూ సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి, అన్ని వర్గాలను ప్రజల సంక్షేమానికి అహర్నిషలు శ్రమిస్తున్న మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే, హలియా టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కోరుకంటి చందర్ పేర్కొన్నారు. మంగళవారం హలియా పట్టణంలో భారీ ఎత్తున లబ్ధిదారులు ర్యాలీ చేపట్టారు.
తదనంతరం జరిగిన లబ్దిదారుల ఆత్మీయ సమ్మేళ కార్య్రకమంలో ముందుగా దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య చిత్ర పటానికి ఎమ్మెల్యే పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ… తెలంగాణ కోసం పుట్టిన కారణజన్ములు కేసీఆర్ అని ప్రశంసించారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు.
వృద్యాప్యంలో వున్న వృద్ధులకు అండగా వారు గౌరవంగా జీవించేందుకు ఆసరా పథకం ద్వారా 2వేల పించన్ ప్రభుత్వం అందించడం జరుగుతుందని, దేశంలో ఎక్కడ లేని విధంగా ఒంటరి మహిళలకు 2వేల పించన్ అమలు చేస్తు వారికి పెద్దన్నలాగా నిలుస్తున్నరన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని రైతుల కష్టాలను తొలగించాన్న సంకల్పంతో 24 గంటల ఉచిత కరెంట్, రైతు భీమా, రైతు బంధు, ఎరువుల పంపిణి చేసి రైతుల కళ్లలో అంనందం నింపుతున్నారన్నారు.
నాగర్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా తము ఆయా వార్డలలో పర్యటించిన సందర్భంలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు లబ్దిపొందుతున్న ప్రతి ఒక్కరు కేసీఆర్ రుణం తీర్చుకుంటామని, కారు గుర్తుకు ఓటు వేసేందుకు సిద్దంగా వున్నామని తెలపుతున్నారని పేర్కొన్నారు.
ఓట్లడిగేందుకు వచ్చే కాంగ్రెస్, బిజేపి, టిడిపి పార్టీలకు మీకు ఓటు ఎందుకు వేయాలని లబ్దిదారులు నిలదీయాలన్నారు. మా సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్న టిఆర్ఎస్కే ఓటు వేస్తామని చెప్పాలన్నారు. నాగర్జునసాగర్ నియోజవర్గంలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయ మన్నారు. లబ్ధిదారులు ఆత్మీయ సమ్మేళనం అనంతరం లబ్ధిదారులతో ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిఫల్ చైర్మన్ పార్వతి-శంకరయ్య, వైస్ చైర్మన్ సుధాకర్, కౌన్సిలర్స్ వెంకటయ్య, శ్రీనివాస్,వెంకట్ రెడ్డి, ప్రసాద్, సీనియర్ నాయకులు తక్కలపల్లి రవీందర్ రావు, మల్గిరెడ్డి లింగారెడ్డి, విజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడి పెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు పెంట రాజేష్, కుమ్మరి శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్ నాయకులు దుర్గం రాజేశం, బోడ్డుపల్లి శ్రీనివాస్ అధిక సంఖ్యలో ప్రజలు, లబ్దిదారులు పాల్గొన్నారు.