(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, మార్చి 23: జీవిత భీమా పాలసీలపై జిఎస్టీ తీసివేయాలని అఖిల భారత జీవిత భీమా ఏజెంట్లు సమాఖ్య పిలుపుమేరకు మంగళవారం రామగుండం ఎల్‌ఐసి బ్రాంచ్ కార్యాలయం ముందు నిరసన తెలిపి రెస్ట్ డే నిర్వహించారు. రామగుండం డివిజన్ బ్రాంచ్ ఏజెంట్ల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రామగుండం డివిజన్ బ్రాంచ్ ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ఇన్సూరెన్స్ పాలసీలపై జిఎస్‌టిని తీసివేయాలని, ఎల్‌ఐసి పాలసీలకు బోనస్ రేటు పెంచాలని, ఎల్‌ఐసిలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ఐటిఓను రద్దు చేయాలని, పాలసీ దారులకు లోన్‌ఫై వచ్చే వడ్డీ రేటు తగ్గించాలని తదితర డిమాండ్లతో రెస్ట్‌డేను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి భీమాదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి నగేష్, డివిజన్ ఉపాధ్యక్షుడు ఎస్ రమేష్, బి.దామోదర్, కె.సతీష్, ఏ.బాబు, కె.శ్రీనివాస్, జె.వి.రమణరావు, డి.నర్సింగం, ఆకుల సురేష్, వి.తిరుపతి, కాశెట్టి శివ, పెరుమాండ్ల శ్రీనివాస్‌గౌడ్, పోలే రాజు, శ్రీధర్, రాజమౌళితో పాటు అధిక సంఖ్యలో ఏజెంట్లు పాల్గొన్నారు.