Home తెలంగాణ ప్రజా సంక్షేమమే తెరాస ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే తెరాస ప్రభుత్వ ధ్యేయం

459
0
Talking to Landlords
MLA Korukanti Chandar talking to landlords

– ఎల్లంపల్లి భూనిర్వాసీతుల సమస్యల పరిష్కరిస్తాం
– గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీలో భూనిర్వాసితులకు కష్టాలు
– నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు ఇండ్రస్టీయల్ పార్కు ఏర్పాటు
– ప్రజా సమస్యల సత్వరం పరిష్కారమే లక్ష్యంగా పాలన
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

(ప్రజాలక్ష్యం విలేకరి – రామగుండం నియోజకవర్గం)
సెప్టెంబర్ 3: ప్రజల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం అంతర్గాం మండలం ముర్ మూర్ గ్రామంలో పల్లె నిద్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎల్లంపల్లి భూనిర్వాసీతుల సమస్యల పరిష్కరిస్తామని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన భూనిర్వాసితులకు గత పాలకులు నిర్లక్ష్యంతో ఆర్ఆండ్ఆర్ అమలులో కష్టాలు పడుతున్నారన్నారు. భూమలు కోల్పోయిన నిర్వాసితులు తమ ఉపాధి కోల్పోయ రన్నారు. భూనిర్వాసితలు తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లను నిర్మాణం చేసుకున్నారు కానీ వాటికి ఇళ్లకు బ్యాంకుల ద్వారా రుణాలు కాని విక్రయాలు జరిపేందుకు విలులేకుండా పోయిందని, నిర్వాసీతులకు భూములపై సంపూర్ణ హక్కులు పొందేలా కృషి చేస్తామని చెప్పారు.  అసెంబ్లీ ఈ విషయం ప్రస్తావనకు తీసుకువస్తామని, ముఖ్యమంత్రి దృష్టికి
తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. గ్రామంలో ఆర్ఆండ్ఆర్ సమస్యల పై జిల్లా ఉన్నతాధికారులతో గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని నిర్వాసితులు తమ ఇబ్బందులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ గొప్ప పాలన సాగిస్తున్నరని, దేశం గర్వించే ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ సిఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. గతంలో మహిళలు త్రాగునీరు కోసం బిందెలతో బోరింగ్ వద్ద క్యూలు కట్టేవారని, త్రాగునీరు కోసం ధర్నాలు చేపట్టిన పరిస్థితు లుండేవని,  కేసీఆర్ అధికారంలో వచ్చాక ఆ పరిస్థితి మారిపోయిం దన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరధ పథకం అమలు చేసి స్వచ్చమైన గోదావరి నీరును ప్రతి ఇంటికి అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నల్లా కనెక్షన్ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్రంలోని పేద విద్యార్ధుల విద్యాభాసం కోసం ప్రభుత్వం గురుకులల్లో ఉచింతగా విద్యను అందిస్తూ సంవత్సరానికి ప్రతి విద్యార్ధిపై 1లక్ష 25 ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులను చేర్పించాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఇండష్ర్టియల్ పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వృద్దులకు ఆసరా పథకం ద్వారా నెలకు 2వేల రూపాయలు అందిస్తు వారి కళ్లలో అనందం నింపుతుందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినా నాటి నుండి ప్రజల సమస్యల పరిష్కరమే లక్ష్యంగా పనిచేస్తున్నానని, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు భరోసా నిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్గాంలో మండలంలోని ప్రభుత్వ ప్రాధమిక కేంద్రం ఉన్నప్పటికి వైద్యపరికరాలు లేక ఆసుపత్రి మూసివేసి ఉంచడం జరిగిందని, తాను ప్రత్యేక దృష్టి సారించిన ఎన్టీపీసి ద్వారా 12 లక్షలు మంజూరు చేయించామని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చిన వాటిని తీర్చేందుకు తాను ముందుటానని తెలిపారు.  రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సరైనా నాయ్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నరని చెప్పారు.

knows people problems
MLA Korukanti Chandar knoews problems of people

ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఎంపిపి దుర్గం విజయ,
జడ్పీటిసి అముల నారాయణ, వైస్ ఎంపిపి మట్టలక్ష్మీ-మహేందర్ రెడ్డి, జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యులు దివాకర్, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ గౌస్ షా, సర్పంచ్ లు బాదరవేణ స్వామి, ధరణి రాజేష్, సతీష్, బండారి ప్రవీన్, మండల టిఆర్ఎస్ అధ్యక్షులు తిరుపతినాయక్, నాయకులు కోల సంతోష్, ఎలుక కోమురయ్య, నువ్వుల సంతోష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here