– నేటి భారత్ బంద్‌కు మద్దతు
– రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 7: కార్పొరేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతులకు అండగా ఉంటామనీ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక విధానలపై నిరసనగా రైతులు తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని రామగుండం నియోజకవర్గ టీఆరెఎస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి సిఎం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంటు, రైతుబీమా రైతుబంధు లాంటి పథకాలను అమలు చేస్తూ రైతులను కంటికి రెప్పాలగా కపాడుతున్న రైతు పక్షపాతి సిఎం అని అన్నారు.
ఎద్దు ఎడ్చినా ఎవుసం… రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడు బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు. గతంలో వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు నాయుడుకు పట్టన గతే రాబోవు కాలంలో మోడి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెబుతారనీ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆరెఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని, చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎన్.డి.ఎ ప్రభుత్వం ఒంటెద్దు పొకడలతో రైతులకు అన్యాయం చేసేలా నల్ల చట్టన్ని తీసుకురావడం బాధకరమన్నారు.
ఈ విలేఖరుల సమావేశంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు కార్పోరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, కొమ్ము వేణుగోపాల్, ఇంజపురి పులిందర్, బాలరాజు కుమార్, బొడ్ధు రవీందర్, గంగ శ్రీనివాస్, పోన్నం లక్ష్మన్, గనముక్కల తిరుపరతీ తానిపర్తి గోపాలరావు, తోడేటి శంకర్ గౌడ్, దుర్గం రాజేశ్, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, ఆడప శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.