Home తెలంగాణ ఓసీపీల‌ పేరుతో బొందల గ‌డ్డ‌గా మార్చుతున్న‌ సింగరేణి

ఓసీపీల‌ పేరుతో బొందల గ‌డ్డ‌గా మార్చుతున్న‌ సింగరేణి

877
0
Singareni OCP (File Phote)
Singareni OCP (File Phote)

– చోద్యం చూస్తున్న ప్ర‌జాప్ర‌తినిధులు
– ఓసిపి-5 ప్రజాభిప్రాయసేకరణను అడ్డుకుంటాం
– యాజమాన్యం ఒంటెద్దుపొకడలు మానుకోవాలి
– సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించిన సిపిఐ నేతలు

(ప్ర‌జాల‌క్ష్యం ప్ర‌తినిధి)
గోదావ‌రిఖ‌ని, న‌వంబ‌ర్ 2ః ఓసీపీల పేరుతో సింగ‌రేణి రామ‌గుండం పారిశ్రామిక ప్రాంతాన్ని బొందలు గ‌డ్డ‌లు మార్చుతుంద‌ని నగర కార్యదర్శి కె. కనక రాజ్, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. రామ‌గుండం పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లో ఉన్న జిడికే-5వ ఇంక్లైన్ గనిని సింగరేణి యాజమాన్యం మూసివేసి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుగా మార్చడానికి ఎలాంటి అనుమతులు లేకున్నా, కనీసం ఇక్కడి ప్రజల అభిప్రాయం లేకుండానే సింగరేణి ఒంటెద్దు పోకడలతో పనులు వేగవంతం చేస్తుంద‌ని తెలిపారు.

CPI
CPI

ఈ 5 గనిని పట్టణ నడిబొడ్డున ఉండడం వల్ల ఎంతో మంది ఉపయోగకరంగా ప్రజలకు కార్మికులకు ఉన్నది. నష్టాల పేరుతో సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఓపెన్ కాస్ట్ మైనింగ్ గా మారుస్తుందని దీనివలన చుట్టుపక్కల ఉన్న రామగుండం కార్పొరేషన్ కు సంబంధించిన దాదాపు 10 డివిజన్లలోని ప్రజలు యాబై వేలకు పైగా మంది. చుట్టూ ప్రక్కన గల గ్రామాలు జనగామ, ముత్యాల, గ్రామాలలోని రైతులకు తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆరోపించారు.

వ్యవసాయ భూములు సాగు చేసుకునే యోగ్యత కోల్పోయే ప్రమాదం ఉంద‌ని, దీని వల్ల జనజీవనం స్తంభించి వలసలకు దారితీస్తుంద‌ని తెలిపారు. గోదావరిఖని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారబోతుందనీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా స్మశానం ను తలపించే విధంగా స్థానిక ప్రజాప్రతి నిధులు, ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఓసీపి-5 ప్రారంభిస్తే ఇక్కడి సింగరేణి అధికార్లు ప్రమోషన్ల కోసం ఆరాటపడుతున్నార‌ని విమర్శించారు.

గతంలో సింగరేణి పరిశ్రమ తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటిదని దేశ సరిహద్దుల్లో ఉన్న ఆర్మీ జవాన్లతో సింగరేణి కార్మికులను పోల్చిన కేసీఆర్, గత ప్రభుత్వాలు సింగరేణి ప్రాంతాన్ని పల్లెలను ఓపెన్ కాస్ట్ ల పేరుతో బొందల గడ్డగా మార్చిందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే బొందల గడ్డలుగా ఉన్న సింగరేణి ప్రాంతంలో అండర్ గ్రౌండ్ గ‌నుల‌ను ప్రారంభించి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నేడు అదే కేసీఆర్ భూగర్భ మూసివేసి ఓసీపీల‌కు శ్రీకారం చుడుతు న్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

OCP at Blasting time (File Phote)
OCP at Blasting time (File Phote)

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తాన‌న్న‌ కేసీఆర్ రామగుండం ప్రాంతాన్ని ఓసిపిల పేరుతో కాలుష్య కోర‌ల్లో స్మశానంగా చేసి బొందల గడ్డగా చేయబోతున్నారని పేర్కొన్నారు. ఓపెన్ కాస్ట్ ల‌ వల్ల ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న పది కిలోమీటర్ల లోపు నివసిస్తున్న ప్రజలు శబ్ద కాలుష్యంతో అనేక భయాందోళనకు గురవు తున్నారు. దుమ్ము, ధూళి, విషవాయువుల వల్ల అనేక అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంద‌ని, 11 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత క్షీణించి, బుద్ధిమాంద్యం, ఎక్కువగా ఉంటుందని, గర్భిణీ స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ త‌న నివేదికలో తెలిపిందని పేర్కొన్నారు.

ఓసీపీల‌ తవ్వకాల వల్ల త్రాగు నీరు కలుషితం కావడం. నీటి వనరులు ఎండిపోవడం వంటి ప్రమాదాలు జరగడం ప్రత్యక్షంగా చూస్తున్నామ‌ని తెలిపారు.‌ ప్రాంతీయ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్థానిక ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఓపెన్ కాస్ట్ -5 నిర్మాణ పనులకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని సంబందించిన అధికారులను కోరారు. లేని ప‌క్షంలో ప్రాంతీయ కాలుష్య కార్యాలయంను ముట్టడిస్తామని హెచ్చ‌రించారు. త్వరలో ఎన్జీటి ఆశ్రయిస్తామని తెలిపారు. ఓసీపి-5ని విర‌మించుకోవాల‌ని సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here