– రామగుండం ఎమ్మెల్వే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 20: రామగుండం పారిశ్రామిక ప్రాంతం మంచి నాయకున్ని కోల్పోయిందని, అందరితో కలివిడిగా వుంటూ, తమ్ముడు…అన్న అంటూ అభిమానంతో పలకరించే మాజీ చైర్మన్ బడికెల రాజలింగం మృతి ఈ ప్రాంతానికి తీరని లోటని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.అదివారం గోదావరిఖనిలో జరిగిన బడికెల రాజలింగం సంతాప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చందర్ హాజరై ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రామగుండం మున్సిఫల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన సందర్భంలో ఈ ప్రాంతానికి ఎంతోగానో సేవ చేశారన్నారు. రామగుండం అభివృద్ధిలో బడికెల పాత్ర వుందని అన్నారు. బడికెల రాజలింగం ఆత్మకు శాంతి చేకురాలన్నారు.
ఈ సంతాప కార్య్రకమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడి పెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు పాముకుంట్ల భాస్కర్, అడ్డాల గట్టయ్య, మేకల సదా నందం, బోడ్డు రవీందర్, వంగ శ్రీనివాస్ గౌడ్, కాల్వ శ్రీనివాస్, పి.టి.స్వామి, మోతుకు దేవరాజ్, నూతి తిరుపతి, అచ్చెవేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, పీచర శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.