Home తెలంగాణ బీజేపీ శ్రేణుల సంబరాలు…

బీజేపీ శ్రేణుల సంబరాలు…

456
0
BJP Celebrations
BJP Leaders Celebrations

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్‌ 30: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అలహాబాద్‌ కోర్టు బీజేపీ అగ్రనేతల పై కేసులను కొట్టివేయడాన్ని స్వాగతిస్తూ బీజేపీ జనగామ మండల శాఖ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బుధవారం సంబురాలు చేసుకొని స్వీట్లు Bపంపిణీ చేసుకున్నారు.

ఈ సందర్బంగా జనగామ మండల అధ్యక్షుడు తాడిపత్రి శ్రీధర్‌ రావు మాట్లాడుతూ 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ నాయకులు లేకున్నా కావాలని అప్పటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టారని, 28 సంవత్సరాల తర్వాత కోర్టు కేసులను కొట్టివేయడం జరిగిందన్నారు. ఇప్పడు బీజేపీ అగ్రనేతలకు న్యాయం జరిగిందని ఆయన తెలిపారు

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మామిడి రాజేష్‌, మారం వెంకటేష్‌, పిడుగు కష్ణ, ఆరే దేవకరణ, దిగుట్ల లింగయ్య, గోగుల రవీందర్‌ రెడ్డి, గుండెబోయిన లక్ష్మణ్‌, ముప్పు యాదగిరి, మామిడి సంపత్‌, పంగ రవి, నక్క లక్ష్మీనారాయణ, మామిడి వీరేశం, కుంభాల రాజు, గుర్రం సురేష్‌, తడబోయిన సత్యం, కోమల్ల పురుషోత్తం, వడ్డేపల్లి సదానందం, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here