– రామగుండం కార్పోరేషన్ ఎదుట బీజీపీ శ్రేణుల ధర్నా
(పజ్రాలక్ష్యం పత్రినిధి)
గోదావరిఖని సెప్టెంబర్ 29: కరోనా విపత్తు సమయంలో పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకునేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో కొత్త దందాకు తెరలేపిందని కార్పోరేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు రామగుండం కార్పోరేషన్ ఎదుట బీజేపీ శ్రేణులు మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయి.
ఈ సందర్భంగా బల్మూరి అమరేందర్ రావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కరోనా విపత్తు సమయంలో ప్రజలపై ఆర్థిక భారం మోపేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వ ఖాజానాను నింపేందుకు ప్రజలపై ఆర్థిక భారం వేయడం సరికాదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్చించారు. పేద ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం నిధులు కెటా యిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని ఇతర పథకాలకు మళ్లిస్తూ పేదకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ నిరుద్యోగుకు భృతి ఇవ్వాని డిమాండ్ చేసారు. టిఆర్‌ఎస్ మోసపూరిత విధానాలను ప్రజులు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎల్‌ఆర్‌ఎస్ వ్యతిరేక నినాదాలు చేసారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దుచేయాని డిమాండ్ చేసారు. అనంతరం కార్పోరేషన్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేయారు.
కార్పోరేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల రాజేందర్, కార్పోరేషన్ ప్రధాన కార్యదర్శి మామిడి అశోక్, అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్, నాయకులు క్యాతం వెంకటరమణ, పిడుగు క్రిష్ణ, మాతంగి రేణుక, కార్పోరేటర్ దుబాషి లలిత, కల్వల శీరిష, తాటిపర్తి శ్రీధర్‌రావు, కోమళ్ళ పురుషోత్తం, పెండ్యాల రవికుమార్, మిట్టపెల్లి సురేష్ కుమార్, దిగుట్ల లింయ్య, గోగుల రవీందర్‌రెట్డి, గాండ్ల ధర్మపురి, మంచికట్ల భిక్షపతి, మళ్లెపూడి ప్రతాప్‌రాజు, నీరటి శ్రీనివాస్, దుబాషి మల్లెష్, కల్వల సంజీవ్, బూడిద రమేష్, నక్క లక్ష్మినారాయణ, ముప్పల యాదగిరి, అడ్లూరి రాజేష్, బాసబోయిన లక్ష్మణ్, పల్లికొండ నిర్సింగ్, గాండ్ల న్వరూప, జూపుడి అమరేశ్వర్‌రావు, బాషబోయిన వాసు, జూల విజయ్, సిలివేరి అంజి, బుంగ మహేష్, రాదండి సునీల్, మామిడి వీరేశం, పంగ రవి, బద్రి దేవెందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.