Home తెలంగాణ సింగ‌రేణిలో 27 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు…

సింగ‌రేణిలో 27 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు…

705
0
G.M. K.Narayana issuing the appointment orders to dependents
G.M. K. Narayana issuing the appointment orders to dependents

– నియామ‌క‌పు ఉత్త‌ర్వుల‌ను అందించిన ఆర్జీవ‌న్ జియం

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, న‌వంబ‌ర్ 19: సింగరేణి ఆర్జీవన్‌ ఏరియాలో కారుణ్య నియామకాల ద్వారా 27 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించినట్లు జియం కె.నారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం రోజున జియం కార్యాలయంలో నియామక ఉత్తర్వులను డిపెండెంట్లకు అంజేశారు.

ఈ సందర్బంగా జియం కె. నారాయణ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తూ వివిధ ఆనారోగ్య కారణాలతో మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌, మృతి చెందిన ఉద్యోగుల వారసులగు 27 మందికి సంస్థలో ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. చాలా తక్కువ సమయంలో26 మందికి మెడికల్‌ ఇన్వాలిడేషన్‌, డెత్‌ ద్వారా ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. వీరందరికి శ్రీ‌రాంపూర్ ఏరియాలో పోస్టింగ్‌ ఇవ్వటం జరిగిందని తెలిపారు.

Dependents who got jobs in Singareni
Dependents who got jobs in Singareni

ఉద్యోగ అవకాశాలు పొందుతున్న వీరంతా ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగు పరుచుకొనుటకు విటిసిలో శిక్షణ తీసుకోవాలన్నారు. సంస్థ సీనియర్‌ ఉద్యోగుల వద్ద పనితనపు మెళవకులు నేర్చుకోవాలన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి దోహదపడి సంస్థ పురోభివృద్ధికి పాడుపడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పర్సనల్‌ మేనేజర్‌ యస్‌. రమేష్‌, అధికారుల సంఘం ప్రతినిధి రాజన్న, డిప్యూటి పర్సనల్‌ మేనేజర్‌ సమ్మయ్య, టిబిజికెఎస్ ఉపాధ్య‌క్షుడు గండ్ర దామోద‌ర్‌, సీనియ‌ర్ పి.ఓ. సారంగ‌పాణి, సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, మళ్లీశ్వరీ, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here