– రైతులను బాధపెడుతున్న బిజెపి ప్రభుత్వం పతనం తప్పదు…
– కార్పోరేట్ కు వ్యవసాయాన్ని దరాదత్తంకు కేంద్రం కుట్ర
– రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 8ః కార్పోరేట్ కు వ్యవసాయాన్ని దరాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని… ఎద్దు ఎడ్చిన ఎవుసం…రైతు ఎడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదని, రైతులకు కన్నీరు పెట్టించే నల్ల చట్టాలను అమలు చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి పతనం తప్పదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి గోదావరిఖని ప్రధాన చౌరస్త, 5 ఇంక్లయిన్, తిలక్ నగర్, రమేష్ నగర్, కళ్యాన్ నగర్, లక్ష్మినగర్ మీదుగా గోదావరి బిడ్డి వరకు బారీ బైక్ ర్యాలీని చేపట్టారు. అనంతరం గోదావరిబిడ్డి పై రస్తారోకోను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ…. రైతుల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు అగ్రహిస్తే బిజెపి ప్రభుత్వానికి అదోగతి తప్పదని… కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతుల వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు చట్టాలు చిన్న సన్నకారు రైతులుకు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల రాజ్యం నడుస్తోందని, రైతుల కష్టాల తెలసిన రైతు బిడ్డ సిఎం కేసీఆర్ తెలంగాణ రైతంగానికి భరోసాగా ఉంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఎంపిలు పోరాడాన్నారు. దేశ రాజధాని డిల్లీలో ఎముకలు కొరికే చలిలో రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటి శాఖ మాత్యులు కేటిఆర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారత్ బంద్ లో పాల్గొనడం జరిగిం దన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు సాగంటి శంకర్, అడ్డాలస్వరూప-రామస్వామి, పాముకుంట్ల భాస్కర్, కన్నూరి సతీష్ కుమార్, ఇంజపురి పులిందర్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి-భూమయ్య, దాతు శ్రీనివాస్, బాల రాజ్ కుమార్, దొంత శ్రీనివాస్ కొమ్ము వేణుగోపాల్ జనగామ కవిత సరోజినీ, శంకర్ నాయక్, కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, మాజీ మేయర్ కొంకటి లక్ష్మి నారాయణ, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, బోడ్డు రవీందర్, తానిపర్తి గోపాల్ రావు, గనముక్కుల తిరుపతి, గంగ శ్రీనివాస్, రాకం దామోదర్, జే.వి.రాజు, కాల్వ శ్రీనివాస్, పోన్న లక్ష్మన్, జహీద్ పాషా, సలీంబెగ్, ధరణి జలపతి, తోడేటి శంకర్ గౌడ్, దుర్గం రాజేశ్, అచ్చెవేణు, చెలకలపల్లి శ్రీనివాస్ చల్లగురుగుల మెగిళి,చెలకలపల్లి మహేందర్ నారాయణదాసు మారుతి, పీచర శ్రీనివాస్, మోతుకు దేవరాజ్, బోడ్డుపల్లి శ్రీనివాస్, దీటి బాలరాజ్, నూతి తిరుపతి, మండ రమేష్, విజయ్ కుమార్, ముప్పు సురేష్, గనవేనసంపత్, ఆడప శ్రీనివాస్, తోకల రమేష్, ఇరుగురాళ్ల శ్రావన్, మేకల అబ్బాస్, యువరాజ్, బూరుగు వంశీకృష్ణ, బస్వరాజ్ గంగరాజ్ తదితరులు పాల్గొన్నారు.