(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైద్రాబాద్, నవంబర్ 11: హైద్రాబాద్ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీని అభివృద్ధి పథం వైపు పయనించేలా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి బుధవారం ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం మంజూరైన రూ 12 కోట్ల 30 లక్షల 55 వేల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
తారనగర్ , వెంకట్ రెడ్డి కాలనీ తదితర ప్రాంతాలలో రూ.1 కోటి 07 లక్షల 11 వేల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, పాపిరెడ్డి కాలనీ , సందయ్య నగర్ తదితర ప్రాంతాలలో రూ.1 కోటి 25 లక్షల 78 వేల అంచనా వ్యయం తో, గోపి నగర్ తదితర ప్రాంతాలలో రూ.65.77 లక్షల వ్యయం తో, నెహ్రూనగర్ , ప్రశాంత్ నగర్ లో రూ.1 కోటి 22 లక్షల 93 వేల తో, ఆదర్శ్ నగర్ లో రూ.57.30 లక్షల అంచనా వ్యయం తో, భాగ్య నగర్ కాలనీ లో కోటి రూపాయల నిధులతో, శ్రీ రామ్ నగర్ బి, సి బ్లాక్ ల్లో లోని తదితర ప్రాంతాలలో రూ. 6 కోట్ల 51 లక్షల 72 వేల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులను చేపట్టనున్నట్లు చెప్పారు.
అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి సహకారంతో శేరిలింగంపల్లి డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గారికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈ సునిల్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, అధ్యక్షుడు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు యాదాగౌడ్, కుంచం రమేష్, వార్డు మెంబర్లు కవితాగోపి, పొడుగు రాంబాబు, శ్రీకళ, ఫర్వీన్, రాములు, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డి, తుల్జాభవాని ఆలయ కమిటీ చైర్మన్ మల్లిఖార్జున శర్మ, సభ్యులు గోవింద్ చారి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే నాయకులు రాగం అనిరుద్ యాదవ్, రవీందర్ యాదవ్, దేవులపల్లి శ్రీనివాస్, కలివేముల వీరేశం గౌడ్, నట్ రాజ్, జ్యోతి, కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, అర్జున్ రావు, ప్రకాష్ చారి, భీం రెడ్డి, కృష్ణ, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, రాజు, గఫర్, కిరణ్, హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొండా విజయ్, పాపిరెడ్డినగర్ కాలనీ అధ్యక్షుడు బద్దం కొండల్ రెడ్డి, సందయ్యనగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజు, లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రవియాదవ్, గోపీనగర్ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్, నెహ్రూ నగర్ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, శ్రీ రాం నగర్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రాంతి, రజిని, చంద్రకళ, సౌజన్య, భాగ్యలక్ష్మి, రాములమ్మ, రోజా, కళ్యాణి వర్క్ ఇన్ స్పెక్టర్లు యాదగిరి, మహేష్ తదితరులు ఉన్నారు.