Home తెలంగాణ ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలి

ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలి

580
0
police are for you
Ramagundam CP Satyanarayana speaking at the event of police are for you

– ఆదివాసి సంక్షేమానికి పోలీసుల అండ
– నిత్యావసర సరుకుల పంపిణీ
– రామగుండం సీపీ సత్యనారాయణ

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మంచిర్యాల, నవంబర్‌ 11: ఆదివాసీలు ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని, వారికి పోలీసుల బాసట నిలుస్తారని రామగుండం సీపీ అన్నారు. బుధవారం రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని తాండూర్‌ సర్కిల్‌, మాదారం పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని బెజ్లాలలో ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి విచ్చేసిన సీపీ సత్యనారాయణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు గిరిజనులు గుస్సాడి నృత్యాలు, డప్పు వాయిద్యాలతో సాంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. తలపాగ అలంకరించి సత్కరించారు. గ్రామ పొలిమేరలో గ్రామ దేవతకు సీపీ, ఎమ్మెల్యే పూజలు చేసారు.

The tribesmen who warmly welcomed CP and MLA
The tribesmen who warmly welcomed CP and MLA

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాలో సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం అన్నారు. గిరిపుత్రులకు మరింత చేరువయ్యేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మారిన సమకాలిన పరిస్థితు లకు అనుగుణంగా గిరిజనుల్లో మార్పు రావాలన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగు పడ్డాయని తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలన్నారు.

tribals participated event of police are for you
tribals participated event of police are for you

గిరిజనుల శ్రేయస్సు కోసం పోలీస్‌ శాఖ ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందని తమ పిల్లలు చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటుందని తెలిపారు. గిరిజనులకు ఎల్లవేళలా క్షేత్రస్థాయి పోలీస్‌ అధికారులు అందుబాటులో ఉండి వారికి ప్రతి విషయంలో తోడ్పాటును అందిస్తూ వారి ఉన్నతికి కషిచేయాలని సూచించారు. గిరిజను లను విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించి వారి ఉన్నతికి తోడ్పడడానికి పోలీస్‌ శాఖ ఎల్లవేళల సంసిద్ధంగా ఉంటుంది అని తెలిపారు.

ప్రభుత్వం అందించే వివిధ లబ్ధి కార్యక్రమాలను గిరిజనులకు చేర వేయడానికి పోలీస్‌ శాఖ ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో సంసిద్ధంగా ఉందని చెప్పారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘ విద్రోహ శక్తులు వీరిని ప్రలోభాలకు గురిచేసి వీరిని చెడు మార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తున్నారని, వారి ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని సూచించారు. ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా పోలీస్‌ శాఖ వారికి అందుబాటులో ఉంటుందని, ఏ సమస్యవచ్చినా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Bellampalli MLA Durgam Chinnaiah speaking at event of police are for you
Bellampalli MLA Durgam Chinnaiah speaking at event of police are for you

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే మారుమూల ప్రాంతాలు సైతం అభివృద్ధికి నోచుకుంటన్నాయన్నారు. త్వరలోనే గ్రామానికి బీటీ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా శ్రేయస్సు కోరకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చాలా పథకాల ద్వారా ప్రజలకు చేరువ కావడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతం పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలనీ అన్నారు.

బెల్లంపల్లి ప్రాంతం పోలీస్‌ అధికారులు ప్రజల అవసరాలను తెలుసుకొని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటూ అందరి మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఎలాంటి అవసరాలు, సమస్యలు ఉన్న తనను సంప్రదించవచ్చని తెలిపారు. ఆదివాసులు అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలని, గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపించిన, పోలిసులకు తెలియచేయాలని సూచించారు. అభివద్ధివైపు అదివాసులు దష్టిసారించాలని కోరారు. ఆదివాసి గిరిజన గ్రామాల్లో పర్యటించాలని, స్థానిక సమస్యలను తెలుసుకోని, వెంటనే పరిష్కరించే మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. ప్రజలకు కేవలం శాంతిభద్రతల సమస్య కాకుండా ఇతర సమస్యలున్నా నిర్భయంగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు వివరించి నట్లయితే వాటి పరిష్కారానికి తమ వంతుగా కషి చేస్తామన్నారు.

Distribution of essential commodities to the tribals
Distribution of essential commodities to the tribals

ఈ సందర్భంగా 300 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, విద్యార్థు లకు స్కూల్‌ బ్యాగులు, వాలీబాల్‌ కిట్లు అందజేశారు. అనంతంరం గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Lunch with tribals ..
Lunch with tribals ..

ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని, ప్రజలకు ‘పోలీస్‌ మీ కోసం’ ఉన్నారు అనే భరోసా కల్పించే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన డీసీపీ మంచిర్యాల ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, ఏసీపీ రహెమాన్‌, తాండూర్‌ సీఐ బాబు రావు, మాదారం ఎస్‌ఐ మానస ని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్‌, జడ్పీటీసీ బానయ్య, ఎంపీపీ పూసాల ప్రయణ్‌కుమార్‌, ఎంపీటీసీ శంకర్‌, సర్పంచ్‌ జంగుబాయి, బెల్లంపల్లి టౌన్‌ సీఐ రాజు, రూరల్‌ సీఐ జగదీష్‌, ఎస్‌ఐ లు రాములు, శేఖర్‌ రెడ్డి, భాస్కర్‌, సమ్మయ్య, ప్రశాంత్‌ రెడ్డి, పోలీస్‌ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధిక సంఖ్యలో గిరిజనులు, కుల పెద్దలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here