Home తెలంగాణ కార్మికులను కన్నబిడ్డల్లా ఆదరిస్తున్న సీఎం కేసీఆర్‌

కార్మికులను కన్నబిడ్డల్లా ఆదరిస్తున్న సీఎం కేసీఆర్‌

493
0
MLA speaking at 2 Incline mine
Ramagundam MLA Korukanti Chander speaking at 2 Incline mine

– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్‌ 23: రక్తన్ని చేమటగా మార్చి దేశానికి వెలుగులు అందింస్తున్న సింగరేణి కార్మికుల కష్టాలను, సమస్యలను పరిష్కరిస్తూ గని కార్మికులను కన్నబిడ్డల్లా సీఎం కేసీఆర్‌ ఆదరిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. శుక్రవారం 2 ఇంక్షయిన్‌, ఓ.సి.వీ 4, సిఎస్‌ పి లో అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం ఆయా దేవాలయాల్లో అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి గని కార్మికుని కుటుబంలో పుట్టిన తనకు గని కార్మికుల కష్టాలు తెలుసునని, గని కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రకతికి విరుద్దంగా భూగర్భగనుల్లో విధులు నిర్వహిస్తారని చెప్పారు. కారోనా మెదలయిన మార్చి మాసంలో సింగరేణి గని కార్మికులు 50శాతం వేతనాలు మాత్రమే ప్రభుత్వం చెల్లించడం జరిగిందని తెలిపారు.

participating in the charity event
MLA Korukanti Chander participating in the charity event

గత వర్షకాల అసెంబ్లీ సమావేశంలో తాము, కోల్‌ బెల్ట్‌ ఎమ్మెల్యేలు సింగరేణి కార్మికుల కష్టాలను వారు పడుతున్న ఇబ్బందులు సీఎంగారి దష్టికి తీసుకువెళ్లామని, బార్డర్‌ లో సైనికులతో సమానం అయిన సింగరేణి గని కార్మికులకు మార్చి మాసం పూర్తి స్థాయి వేతనం అందించాలని కోరామన్నారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్‌ మార్చి మాసం 50శాతం వేతనం మాంజూరు చేశామని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కార్పోరేషన్‌ సంస్థలో లాభాల వాటాను అందిస్తుంది. సింగరేణి సంస్థ, తెలంగాణ ప్రభుత్వామేనని అన్నారు.

సింగరేణి గని కార్మికులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్నబిడ్డల్లా ఆదరిస్తు వారి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నరని అన్నారు. గత పాలకులు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి అమలు చేసిన ఘనత సిఎం దక్కుతుందన్నారు. కార్మికులను అమ్మవారు చల్లంగా చూడాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అశ్వీస్సులు అందించాలని అమ్మవారిని వేెడుకున్నారు.

వేర్వురుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో టిబిజికెఎస్‌ కేంద్ర కమిటీ జనరల్‌ సెకట్రరి జహీద్‌ పాషా, నాయకులు గండ్ర దామోదర్‌ రావు, లక్కాకుల లక్ష్మన్‌, రాంరెడ్డి, దుట శేషగిరి, మండ రమేష్‌ గౌడ్‌, పుట్ట రమేష్‌. దాసరి నర్సయ్య, గండు శ్రావన్‌, శ్రీనివాసరెడ్డి, పోట్టాల రాంచెందర్‌, కుమార్‌, మల్లయ్య, ఆయా గనుల అధికారులు సురేష్‌, సాయి ప్రసాద్‌, కిరన్‌,మధవరెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here