మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కోరిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 2: రామగుండం నియోజవర్గంలో సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర టూరిజం, కల్చరల్ శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో మంత్రి నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు.
రామగుండం నియోజవర్గంలో ప్రతిభ కలిగిన కలిగిన సంగీత కళాకారులున్నారని, ఈ ప్రాంతంలో చాలా మంది యువతకు సంగీతం నేర్చుకోవాలనే అసక్తి ఎక్కువ ఉందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంగీత కళాశాలకు అనువుగా ఉంటుందని, సంగీత కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు.
ఎమ్మెల్యే వెంట రామగుండం నగర డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు ఉన్నారు.