Home తెలంగాణ బొగ్గు ఉత్పత్తి ఆశాజనకం…

బొగ్గు ఉత్పత్తి ఆశాజనకం…

700
0
RG-I GM K.Narayana
RG-I GM K.Narayana

– ఆర్జీవన్‌ జనరల్‌ మేనేజర్‌ కె.నారాయణ

(ప్రజాలక్ష్యం కోల్‌బెల్ట్‌ ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్‌ 1: సింగరేణి ఆర్జీవన్‌ ఏరియాలో బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా వుందని జనరల్‌ మేనేజర్‌ కల్వల నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్జీవన్‌ ఏరియాలో నవంబర్‌ మాసంలో 3,04,900 టన్నుల లక్ష్యానికి గాను 2,06,558 టన్నుల సాధించి 68 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా ఒ.బి.(మట్టి) 6,00,000 టన్నుల లక్ష్యానికి గాను 8,50,117 టన్నుల 142 శాతం ఒ.బి. తీశామని తెలిపారు. ఆర్జీవన్‌ ఏరియాలో బొగ్గు ఉత్పత్తి ఊపందుకుంటున్నదని జీఎం నారాయణ తెలిపారు.భూగర్బ గనుల్లో కార్మికుల హాజరు శాతం పెరుగుతున్న దన్నారు. జిడికె.1 సిహెచ్‌పి ద్వారా రోజుకు రెండు రేకుల బొగ్గును రైల్‌ ద్వారా పంపిస్తున్నామని తెలిపారు.

భూగర్బ గనులు, ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌లో ప్రణాళిక బద్దంగా తనికీలు చేసి రక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆర్జీవన్‌ ఏరియాలో కరోనా కేసులు తగ్గినప్పటికి శీతాకాలంలో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సింగరేణియులు, వారి కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు శుభ్రత పాటిస్తూ విధిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరంతో సామూహిక కార్యక్రమాలలో పాల్గొనాలని నారాయణ పేర్కొన్నారు.

ఫిబ్రవరి, 2021లో జిడికె.5 ప్రాజెక్ట్‌ పబ్లిక్‌ హియరింగ్‌ కోసం సన్నాహాలు చేస్తున్నామని జియం తెలిపారు. ఎక్స్‌ఫర్ట్‌ అప్రైజల్‌ కమిటీ, డిల్లీ వారు డిసెంబర్‌ 3వ వారంలో గతంలో నిర్వహించిన పబ్లిక్‌ హియరింగ్‌లో పర్వావరణానికి చేపట్టిన అభివద్ది కార్యక్రమాలను డిసెంబర్‌ 3వ వారం ఎల్‌పి ఈ కమిటీ వచ్చి పర్యవేక్షిస్తుందని తెలిపారు. అనంతరం పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహిస్తామని జియం పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో ఆర్జీవన్‌ ఏరియాలో విశ్లేషణ చేసినప్పుడు గతంలో 100 మందికి కరోనా టెస్టులు చేసినప్పుడు సున్నా రాగా, ఇటీవల కేసులు 100 మందికి కరోనా టెస్టులు చేసినప్పుడు 1 నుండి 5 పెరిగిన దష్ట్యా తగుజాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు , కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కరోనా పరీక్షలు చేసుకోనట్లతే పరీక్షలు చేసుకోవాలని, సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here