– మీషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు
– గ్రామాల సమగ్రాభివృద్దే లక్ష్యం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 2ః రైతుల సంక్షేమమే ద్యేమంగా తెరాస ప్రభుత్వం పాలన సాగిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం పాలకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలను తోలగించే విధంగా పాటుపడుతున్నారని పేర్కొన్నారు. రైతులు ఉచితంగా 24గంటల కరెంట్, రైతు బీమా, రైతు బంధు, సకాలలంలో ఎరువుల పంపిణి చేసి ప్రభుత్వం భరోసా కల్పిస్తూ అండగా నిలుస్తోందన్నారు.
కరోనా వ్యాప్తి నేపద్యంలో రైతులు పండించిన పంటను కోనుగోలు చేసిన ఘనత సిఎం కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో దాన్యం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిందరన్నారు. సన్నబియ్యం మద్దతు ధర విషయంలో రాష్ట్ర మంత్రులు సిఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, త్వరలోనే మంచి ధర నిర్ణయం జరుగుతుం దన్నారు. మీషన్ భగీరధ ద్వారా ప్రతి ఇంటికి ఉచింతగా నల్లకనెక్షతో పాటు స్వచ్చమైన త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోందన్నారు.
కరోనా వ్యాప్తిని నివారించేందుకు గ్రామాల్లో అరోగ్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు వున్నవారు వెంటనే కారోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి గ్రామంలో డప్పుచాటింపులు చేసి గ్రామ పంచాయితి కార్యాయాల వద్ద కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల సంపూర్ణ అభివృద్దే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పాలన సాగింస్తుందన్నారు. గ్రామాలలోని సమస్యలను ఒకోక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
ఈ సమావేశంలో మండల ఎంపిపి వాల్వ అనసూర్య రాంరెడ్డి, వైస్ ఎంపిపి ఎర్రం స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య, అధికారులు సంజీవ్ తో ఆయా గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.