– డిపిఓకు ఉప సర్పంచుల సంఘం విజ్ఞప్తి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
నిజామాబాద్, అక్టోబర్ 22: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం, నిజాంపూర్ గ్రామ ఉపసర్పంచ్‌ను యధావిధిగా కొనసాగించాలని ఉప సర్పంచ్ ల సంఘం కోరింది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యకుడు గంగారెడ్డి నేతృత్వంలో గురువారం డిపిఓ జయసుధను కలిసి వినతి పత్రం సమర్పించారు. నిజాంపూర్ గ్రామ సమావేశంలో గ్రామ సర్పంచ్, కార్యదర్శి, పాలకవర్గం సభ్యులు సురకత్తుల పెద్దన్న సామావేశాలకు రావడంలేదనే నేపంతో ఉప సర్పంచ్ స్థానంలో మరొకని నియమించాలని తీర్మానం చేసారు. ఆ తీర్మానం ప్రతిని పెద్దన్నకు పంపడం జరిగింది. వాస్తవానికి ఉప సర్పంచ్ సురకత్తుల పెద్దన్న సెప్టెబర్ 9 నుండి అక్టోబర్ 21 వరకు రిమాండ్ లో ఉండడం కారణంగా ఆ కాలంలో జరిగిన పంచాయితి సమావేశానికి హాజరు కాలేక పోయారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అట్టి తీర్మానం నిలిపివేస్తూ ఉప సర్పంచ్ గా పెద్దన్ననే యధావిధిగా కొన సాగించాలని జిల్లా ఉప సర్పంచుల సంఘం ఆ వినతి ప్రతంలో కోరింది.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంగా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈర్నాల స్వామి, కార్యదర్శులు పేరా లింభాద్రి, తెంగల్ల పల్లి సుదర్శన్, రాచ రమేశ్, నూకల రమేశ్, డిస్కో రాములు తదితరులు పాల్గొన్నారు.