– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(పజ్రాలక్ష్యం పత్రినిధి)
గోదావరిఖని సెప్టెంబర్ 30: రామగుండం కార్పోరేషన్‌లో ప్రజల అకాంక్షల మేరకే పరిపాలన సాగిస్తున్నామని, ఆ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. బుధవారం 5వ డివిజన్ మాల్కాపూర్‌లో 5లక్షల వ్యయంతో నిర్మించే అండర్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… కార్పోరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో ప్రజ సమస్యల పరిష్కరిస్తూ ఓ ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్పోరేషన్‌లోని అన్ని డివిజన్‌లను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కో అప్షన్ సభ్యులు దివాకర్, కార్పోరేటర్లు కల్వచర్ల కష్ణవేణి-భూమయ్య, కుమ్మరి శ్రీనివాస్, కుమ్మరి శారద తదితరులు పాల్గొన్నారు.