– తెలంగాణ యువతులకు వరంగా కళ్యాణలక్ష్మి పధకం
– అందరికి ఆమోదయోగ్యంగా కొత్త రెవెన్యూ చట్టం
– సింగరేణి భూముల్లోని నివాసాలకు యాజమాన్యహక్కు కోసం కృషి
– 4కోట్ల 76లక్షల కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కుల పంపిణి
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 30: దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సకలవర్గాల సంక్షేమంతో పాటు పేద కుటుంబాల కష్టాలను, కన్నీళ్లు తుడుస్తున్న సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం గోదావరిఖని పట్టణంలోని మార్కండేయకాలనీ లక్ష్మిఫంక్షన్ హాల్‌లో రామగుండం మండలం 479 కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ లబ్ధిదారులకు 4కోట్ల 76 లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమమహనేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల అదష్టమన్నారు. నేటి సమాజ పరిస్థితుల్లో ఆడపడుచుల వివాహాలు చేయాలంటే పేద కుటుంబాలకు భారంగా మారిదంని, పెదింటి ఆడపచుల పెళ్లిలకు ఇబ్బందులు పడవద్దని సిఎంగారు కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ పధకం అమలు చేసి 1లక్ష116 అందించండం జరుగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివద్ధి, సంక్షేమ పధకాలను ఇతర రాష్ట్రాలు అచరిసున్నారని, పసిపాప నుండి పండు ముసలి వరకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు. రామగుండం నియోజవర్గం అభివద్దే తమ ప్రధాన ఎజెండాగా నిత్యం ప్రజా క్షేతంలో ఉండి ప్రజలకు సేవ చేసున్నానన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణి స్థలాల్లో నివాసాలకు పట్టాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి మాంజూరు కోసం 76జివోను అమలు చేయించా మన్నారు. ఇక్కడి 27 వేల నివాసాలకు పూర్తిగా యాజమాన్య హక్కులు కల్పించే విధంగా పట్టాలు మాంజూరు కోసం పాటుపడుతున్నామన్నారు. రామగుండం పట్టణంలోని 1, 20, 21 డివిజన్ లోని జేన్ స్ధలాల నివాసాలకు కుడా క్రమబద్దీకరణకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరడం జరిగిందన్నారు.
రామగుండం నిరుద్యోగ యువత ఉద్యోగాలు కల్పించేందుకు అంతర్గాం మండల కేంద్రంలోని వీవింగ్, సిన్నింగ్ భూముల స్థలంలో ఇండ్రస్టీయల్ పార్కు ఏర్పాటు పూర్తి చేశామని త్వరలోనే వాటి పనులు ప్రారంభమవుతాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రెవెన్యూ చట్టం అందిరికి ఆమోదయోగ్యం ఉందని, ఎలాంటి అవినీతికి తావులేకుండా రిజిస్టేషన్లు, మ్యుటేషన్లు అమలు అవుతాయన్నారు. తెలంగాణ సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు రుణపడి ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, జిల్లా జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు దివాకర్, కార్పోరేటర్లు సాగంటి శంకర్, అడ్డాల స్వరూప రామస్వామి, దాతు శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, ఎన్.వి.రమణరెడ్డి, కల్వచర్ల కష్ణవేణి-భూమయ్య, అడ్డాల గట్టయ్య, కన్నూరి సతీష్ కుమార్, అఫ్రీన్ పాతిమా-సలీంబెగ్, కోమ్ము వేణుగోపాల్, దోంత శ్రీనివాస్, ఇంజపూరి పులిందర్, పాముకుంట్ల భాస్కర్, మేకల సదానందం, బాల రాజ్ కుమార్, మంచికట్ల దయాకర్,జేట్టి జ్యోతి-రమేష్, జంగపల్లి సరోజన-కనుకయ్య, గనముక్కుల మహలక్ష్మి-తిరుపతి, నీల పద్మ-గణేష్, శంకర్ నాయక్, బాదె అంజలి, కో ఆప్షన్ సభ్యులు చెరకు బుచ్చిరెడ్డి, నాయకులు బోడ్డు రవీందర్, తాళ్ల రాజయ్య, ర్యాకం వేణు,ధరణి జలపతి, పోన్నంలక్ష్మన్ గౌడ్, దుర్గం రాజేష్, అచ్చెవేణు, మోతుకు దేవరాజ్, నూతి తిరుపతి, బోడ్డుపల్లి శ్రీనివాస్, మేకల పోశం, తోడేటి శంకర్ గౌడ్,పీచర శ్రీనివాస్, ఆడప శ్రీనివాస్, కుమ్మరి శారదా, ఇరుగురాళ్ల శ్రావన్, మేకల అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.