Home తెలంగాణ క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ చెక్‌ల పంపిణి…

క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ చెక్‌ల పంపిణి…

626
0
Distribution of Kalyan Lakshmi Shadimubarak cheques
MLA Korukanti Chander distributing cheques

(ప్ర‌జాల‌క్ష్యం ప్ర‌తినిధి)
గోదార‌వ‌ఖ‌ని, న‌వంబ‌ర్ 3ః గోదావరిఖని గాంధీ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పంపిణీ చేసారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ఆడపిల్లల పెళ్లి, తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్  ఆలోచన చేసి ఇస్తున్నదే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకమని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా, కేవలం తెలంగాణలో మాత్రమే అమల వుతున్న పథకమిది పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఆడపిల్ల పెళ్లి చేసిన తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లక్ష 116 రూపాయలు అందే విధంగా, తాను వారి ఇంటికి ఒక అన్నగా, తమ్ముడిగా, పెద్ద కొడుకుగా బాధ్యత వహిస్తానన్నారు.

Distribution of Kalyan Lakshmi Shadimubarak cheques
MLA Korukanti Chander distributing cheques

సంక్షేమ పథకాలతో రాష్టాన్ని పాలిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ బాల రాజ్ కుమార్, నాయకులు పొన్నం లక్ష్మణ్, కల్వల సంజీవ్, నూతి తిరుపతి, బెందె నాగభూషణం గౌడ్ ల‌బ్దిదారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here