Home తెలంగాణ ఆశావర్కర్ల సేవ‌లు అభినంద‌నీయం

ఆశావర్కర్ల సేవ‌లు అభినంద‌నీయం

703
0
Asha Workers
Ramagundam MLA Korukanti Chander speaking at Asha workers programme

– రామ‌గుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద‌ర్‌

(ప్ర‌జాల‌క్ష్యం ప్ర‌తినిధి)
గోదావ‌రిఖ‌ని, న‌వంబ‌ర్ 27ః క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆశావ‌ర్క‌ర్ల అందించిన‌ సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని రామ‌గుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద‌ర్ అన్నారు. పీఆర్సీ పెంపుపట్ల హర్షం వ్య‌క్తం చేస్తూ శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో ఆశావర్కర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఆశావర్కర్లు క‌రోనా వ్యాప్తి సమయంలో బాధితులకు అండగా నిల‌వ‌డ‌మే కాకుండా వారికి ధైర్యం కల్పించి తమ సేవ గుణాన్ని చాటరన్నారు. ఆశావర్కర్ల సేవ‌ల‌ను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీఆర్సీ పెంచి అర్దికంగా అదుకున్నార‌ని తెలిపారు. ఈ ప్రాంతంలోని ఆశా వ‌ర్క‌ర్ల‌కు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఆశా వర్కర్ల ఎదుర్కొంటున్న‌ సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్ర‌స్తావిస్తాన‌ని అన్నారు.

Asha Workers
Anointing programme of Asha workers

ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ నాయకులు అచ్చే వేణు నారాయణదాసు మారుతి ఉల్లంగుల రమేష్ తోపాటు అధిక సంఖ్య‌లో ఆశావర్కర్లు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here