Home తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి…

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి…

655
0
MLA speaking in TRS Party meeting
MLA Korukanti Chander speaking at the TRS Party organizational structure meeting

– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

(ప్రజాలక్ష్యం పత్రినిధి)
గోదావరిఖని, అక్టోబర్‌ 1: టిఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన రామగుండం నియోజవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, పట్టణ కమిటి అధ్యక్షులు, ఆయా డివిజన్‌ ఇంచార్జ్‌ లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమన్వయ కమిటి సభ్యులు, పట్టణ కమిటి బాధ్యులు, డివిజన్‌ ఇంచార్జీలు రామగుండం నియోజవర్గంలో టిఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేరే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి పురపాలక మంత్రి వర్యులు కేటిఆర్‌ స్పూర్తితోనే ప్రజాపరిపాలన సాగిస్తున్నామన్నారు.

Participate TRS Cadre
Coordinating committee members, town committee Presidents, Division Incharges attending the meeting

రామగుండం నియోజవర్గంలో టిఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉందన్నారు. తెరాస పార్టీ బలోపేతమే మనందరి లక్ష్యం కావాలన్నారు. ప్రజలకు మరింతగా మెరుగైన సేవలందించేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని కోరారు. పార్టీలో నూతనంగా పదవులు పొందిన వారు తమ పదవులకు న్యాయం చేయాలని సూచించారు. తెరాస పార్టీ ప్రతిష్టను మరింతగా పెంచే విధంగా పట్టణ కమిటిల అధ్యక్షులు పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌ కుమార్‌, డిప్యూటి మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, సమన్వయ కమిటీ, పట్టణ కమిటి సభ్యులు పాతపెల్లి ఎల్లయ్య, అడ్డాల రామస్వామి, దివాకర్‌, దుర్గం రాజేష్‌, తోడేటి శంకర్‌ గౌడ్‌, మూల విజయరెడ్డి, బోడ్డు రవీందర్‌, అచ్చె వేణు, మారుతి, దీటి బాలరాజ్‌, మోతుకు దేవరాజ్‌, బోడ్డుపల్లి శ్రీనివాస్‌, తానిపర్తి గోపాల్‌ రావు, మండ రమేశ్‌, నూతి తిరుపతి, చల్లగురుల మెగిళి, నూతి తిరుపతి, చల్లగురుల మొగిలి, మేకల పోశం, నాయక్‌, మండ రమేష్‌, ఆడప శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here