Home తెలంగాణ వ్యాస రచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం

వ్యాస రచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం

418
0
essay writing, photography, short film competitions

ప్ర‌జాల‌క్ష్యం ప్ర‌తినిధి, నల్లగొండ, అక్టోబ‌ర్ 20 : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అక్టోబర్-21 (ఫ్లాగ్ డే) సందర్భంగా విధ్యార్థిని, విధ్యార్థులకు ఆన్ లైన్ వ్యాసరచన పోటీలతో పాటుగా ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ లకు సంబంధించి పోటీలను నిర్వహిస్తున్నట్లు డిఐజి రంగనాధ్ తెలిపారు.

ఈ పోటీలను పోలీస్ శాఖ రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తోందని, ఇందులో విద్యార్థులతో పాటు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు పాల్గొనాలని ఆయన కోరారు. జిల్లాలో పోలీస్ ఫ్లాగ్ డే పోటీలకు వివరాలను వెల్లడిస్తూ వ్యాస రచన పోటీలకు విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూ బాషలలో ఏదైనా ఒక భాష ను ఎంపిక చేసుకోవాలని, ఎనిమిదవ తరగతి నుండి డిగ్రీ చదివే విధ్యార్థులు ఈ వ్యాసరచన పోటీలలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.

మూడు కేటగిరిలుగా ఈ పోటీలను నిర్ణయించడం జరిగిందని, మూడు కేటగిరిలకు చెందిన విధ్యార్థులు జాతి నిర్మాణం లో పోలీసుల పాత్ర అనే అంశంపై https://forms.gle/HvF8YAgewvyD3wjA9 ఈ లింక్ ద్వారా విధ్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొనాల్సి వుంటుందని చెప్పారు.

ఈ వ్యాసరచన పోటీలకు ఈ నెల 24వ తేదీ చివరి రోజని ఆయన వివరించారు. అదే విధంగా ఫోటోగ్రఫీ పోటీలకు సంబంధించి కమ్యూనిటీ పోలీసింగ్, ఆత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన మరియు ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవలతో పాటు ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2020 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ 28వ తేదీల మధ్యకాలంతో తీసిన రెండు ఫోటోలను https://forms.gle/uJj58xXN1GQPNjp8A” లింక్ ద్వారా తమ పూర్తి వివరాలతో ఈ నెల 28 తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని, అలా కాకుండా 10X12 సైజ్ ఫోటోలు రెండు కాపీలు ఈ నెల 24వ తేదీ లోగా జిల్లా పోలీస్ కార్యాలయం లో అందజేయాలని డిఐజి రంగనాధ్ తెలిపారు.

షార్ట్ ఫిల్మ్ పోటీలు:

(మూడు నిమిషాల నిడివితో మాత్రమే ఉండేలా. రెండు సి.డి.లు ఇవ్వాలని, పోలీసు శాఖకు సంబంధించిన విధులు, వివిధ రకాల సేవలు, ప్రత్యేకతలతో కూడిన షార్ట్ ఫిల్మ్ ను (తెలుగు/ఉర్దూ/ఇంగ్లీష్ భాషలలో) సమర్పించాలని సూచించారు. ఈ పోటీలలో పాల్గొనదలచిన పాత్రికేయ మిత్రులు, యువత, ప్రజలు, ఆసక్తి కలిగిన వ్యక్తులు ఈ నెల 24వ తేదీ లోపుగా తమ సి.డి.లు జిల్లా పోలీసు కార్యాలయంలో కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.

సమాజంలో శాంతి భద్రత పరిరక్షణ కోసం శ్రమించి తమ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న ఈ పోటీలకు విధ్యార్థులతో పాటు, ప్రజలు పెద్ద సంఖ్య పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా డిఐజి రంగనాధ్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here