(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 18: సింగరేణి ఎస్.సి. చీఫ్ లైజన్ అధికారిగా ఆర్జీవన్ జియం కె.నారాయణ నియమించబడ్డారు. ఈ మేరకు శుక్రవారం డైరెక్టర్ (ఆపరేషన్ అండ్ పా), ఈ అండ్ ఎం ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్, పి అండ్ పి ఎన్. బరామ్ల నుండి కొత్తగూడెంలో నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్బాంగా జియం కె. నారాయణను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా జియం మాట్లాడుతూ సింగరేణి ఎస్.సి చీఫ్ లైజన్ అధికారిగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన సింగరేణి సి అండ్ ఎండి ఎన్. శ్రీధర్ మరియు డైరెక్టర్ (ఆపరేషన్ అండ్ పా), ఈ అండ్ ఎం ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్, పి అండ్ ఎన్. బలరామ్‌లకు కృతజ్ఞతులు తెలిపారు. షెడ్యూల్ కాస్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, ఇతర సమస్యలను సామరస్య పూర్వక పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. నాకు అప్పగించిన ఈ భాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వహిస్తానని జియం కె.నారాయణ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జియం ఈ ఈ అండ్ వెల్ఫేర్ సి.ఎస్.ఆర్ బసవయ్య, జియం పర్సనల్ ఆనందరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.