– తెలంగాణ కోసం పుట్టిందే టిఆర్ఎస్ పార్టీ
– 12వ వార్డులో ఎన్నికల కార్యాలయం ప్రారంభం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హాలియా (నాగార్జనసాగర్) మార్చి 24ః నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే, హలియా టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం హలియా మున్సిపాలటీ 12వ వార్డులో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ… హాలియా మున్సిపాలిటిలోని ప్రతి వార్డులో పర్యటిస్తూ ప్రజలకు ముఖ్యమంత్రి అమలు పరుస్తున్న పథకాలను వివరించాలని కోరారు. ప్రజల సమస్యలను తెలుసుకొంటూ వాటి పరిష్కారానికి బరోసా ఇవ్వాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్దిదారుల లందరు టిఆర్ఎస్ పార్టీకే ఓటేయటానికి సిద్దంగా ఉన్నారని, వారిని ఓటింగ్‌లో పాల్గొనే చేయాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసమే పుట్టిన పార్టి టిఆర్ఎస్ అని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని కోరారు.
సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు ప్రజలంతా ముందుకు వస్తున్నారని, ముఖ్యంగా ఆసరా ఫించన్ల ద్వారా లబ్ది పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని విధిగా కలుసుకొని ఓటును అభ్యర్థించాలని కోరారు. అలాగే 24 గంటల ఉచిత కరెంట్, రైతు భీమా, రైతు బంధు పొందుతున్న రైతులను కలుసుకొని ఇంకా ఏమైనా సమస్యలను వుంటే అడిగి తెలుసుకోవాలని కోరారు. వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రతి కార్యకర్త పని చేసి టిఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం పాటుపడాలని కోరారు. అనంతరం భరోస సమావేశంలో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిఫల్ చైర్మన్ పార్వతి-శంకరయ్య, వైస్ చైర్మన్ సుధాకర్, కౌన్సిలర్స్ వెంకటయ్య, వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు తక్కలపల్లి రవీందర్ రావు, మల్గిరెడ్డి లింగారెడ్డి, విజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ముత్యాలు, దుర్గం రాజేష్ అధిక సంఖ్యలోకార్యకర్తలు పాల్గొన్నారు.