Home తెలంగాణ మందు బాబులకు ఫ్యామిలీ కౌన్సెలింగ్

మందు బాబులకు ఫ్యామిలీ కౌన్సెలింగ్

495
0
Family counseling for drunk drivers in ramagundam
Family counseling for drunk drivers in ramagundam

ప్రజా లక్ష్యం , గోదావరిఖని : గత కొంతకాలంగా నిర్వహించిన స్పెషల్ డ్రంక్&డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు రామగుండం ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి 80 మంది మందుబాబులు వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ కార్యాక్రమనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన  గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ గారు మాట్లాడుతూ మధ్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి వివరించారు.

మద్యం సేవించి వాహనం నడపు వారు మానవబాంబు తో సమానం అని, మద్యం సేవించిన వారు సరియైన స్పృహలో ఉండకపోవడం వలన వారికి వాహనము పై అదుపు ఉండదు. కావున ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మందుబాబులు చేసే డ్రైవింగ్ వలన వారే కాకుండా ఎటువంటి తప్పు చేయని మిగితా అమాయక ప్రయాణికులు లేదా పాదచారులు ప్రమాదంలో వికలాంగులుగా, లేదా మరణించడం జరుగుతున్నది. వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంటుంది.

ఇంటి పెద్దదిక్కు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం లేదా వికలాంగులుగా మారితే ఆ కుటుంబం వీధిన పడుతుంది. కావున వాహనం నడిపే వారు చాలా బాధ్యతగా నడపవలసి ఉంటుంది. ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు మన కోసం ఎదురుచుస్తూన్నారు అనే విషయాన్ని వాహనదారులు గుర్తుంచుకొని తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాలి అని వివరించారు.

ఫ్యామిలీ కౌన్సెలింగ్

ఫ్యామిలీ కౌన్సెలింగ్ కి వచ్చిన కుటుంబ సభ్యులకు కూడా పలు సూచనలు చేశారు. మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశ్యం కాదు. మీ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం వలన వారిలో మార్పు వచ్చి ఇక ముందు మధ్యం సేవించి వాహనం నడపుకుండా చేయలనేదే మా ఉద్దేశ్యం అని తెలిపారు. మీరు కూడా మీ ఇంటి దగ్గర మీ కొడుకులకు,భర్తలకే కాకుండా మీ ఇంటి దగ్గరి వారికి కూడా మధ్యం సేవించి నడిపితే జరిగే పరిణామాల గురుంచి వివరించి వారిని కూడా జాగృతం చేయాలని తెలిపారు.

మధ్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాన్ని సీజు చేయడం తో పాటు లైసెన్సు లు రద్దుకు సిఫారసు చేస్తామని, వారు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం 10,000/- ల రూపాయల జరిమానాలతో పాటుగా జైలు శిక్ష కూడా అనుభవించాలిసి వస్తుందని హెచ్చరించారు.

ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కి పలు సూచనలు చేశారు. సమాజంలో మీరు చేసే సేవలు గొప్పవని, ప్రయాణికుల ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మద్యం సేవించకుండా వాహనాలను నడుపుతూ సమాజంలో మిగితా వారికి ఆదర్శంగా ఉండాలని సూచించారు.

ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాల నుండి బయటపడొచ్చని తద్వారా వారి కుటుంబాలే కాకుండా సమాజం కూడా చక్కగా ఉంటుందని వారికి అర్ధమయ్యేలా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సూర్యనారాయణ,కమలాకర్, ఏఎస్సై శంకరా చారి,మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here