Home తెలంగాణ బియంఎస్ ద్వారానే కార్మికుల సమస్యలకు పరిష్కారం…

బియంఎస్ ద్వారానే కార్మికుల సమస్యలకు పరిష్కారం…

597
0
meeting
RG-I Vicepresident Parlapelli Ravi speaking at meeting

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని సెప్టెంబర్ 1: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు బియంఎస్ ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని ఆర్జీవన్ ఉపాధ్యక్షులు పర్లపల్లి రవి అన్నారు. మంగళవారం రోజు స్థానిక ఆర్జీవన్ పరిధిలోని ఏరియా వర్క్ షాప్ లో సింగరేణి కోల్ మైన్ కార్మిక సంఘ్ (బియంఎస్) కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి  ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు పర్లపల్లి రవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికవర్గ పక్షపాతిగా పనిచేసే బియంఎస్ దేశంలో పార్టీలకు అతీతంగా అనేక పోరాటాలు చేసిందని, అలాగే  సింగరేణిలో కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎనలేని పోరాటాలు చేస్తుందని తెలిపారు. కార్మికుల రోజువారీ సమస్యలు కూడా పరిష్కరించలేని హీన స్థితిలో గుర్తింపు సంఘం ఉందని, యాజమాన్యం చంకలో చేరి కార్మికుల సమస్యలు గాలికి వదిలేసి కేవలం పైరవీలకు మాత్రమే పరిమితం అయ్యింది విమర్శించారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించిన కార్మికులను యాజమాన్యంతో కలిసి వేధింపులకు గురి చేస్తుందన్నారు. కరోనా కష్ట కాలంలో మానవతా దృక్పథంతో వ్యవహరించవలసిన యాజమాన్యం క్వారంటయిన్ లీవుల విషయంలో కూడ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ కార్మికులను మానసిక వేదనకు గురి చేస్తుంది ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయంలో గుర్తింపు సంఘం యాజమాన్యం గొంతునే వినిపిస్తోందని, కార్మికుల నుండి కట్ చేసిన మార్చి నెల వేతనాలను ఇప్పించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని దుయ్యబట్టారు. ఈ స్థితిలో సమస్యల పరిష్కారానికి బియంఎస్ కు అండగా నిలబడి పోరాడాలని కార్మిక వర్గానికి  పిలుపు నిచ్చారు.

ఈ సందర్భంగా ఏరియా వర్క్ షాప్ పిట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పిట్ కార్యదర్శిగా దేశెట్టి వెంకట్ స్వామిని ఎన్నుకున్నారు. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బియంఎస్) డివిజన్ కార్యదర్శి కర్రావుల మహేష్ అధ్యక్షత జరిగిన సమావేశంలో కేంద్ర నాయకులు బొర్ర రాజశేఖర్ తుమ్మ గట్టయ్య, రేనుకుంట్ల శ్రీనివాస్, ఐ. రమేష్, రాంసాగర్, అశోక్ కుమార్,నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here