– కళాకారులకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 6: దేశం గర్వించే విధంగా పలు భాషల్లో దాదాపు 40వేలకు పైగా పాటలు పాడిన గాన గాంధర్వం, స్వర శిల్పి బాలసుబ్రహ్మణ్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీలోని లక్ష్మిఫంక్షన్‌హాల్ నందు రామగుండం సంస్కతి సంక్షేమ కమిటి అధ్వర్యంలో స్వర్గీయ బాలసుబ్రమణ్యం స్వర నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే చందర్ బాలు చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశంలోని గాయకులకు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం స్ఫూర్తిదాయకంగా ఉన్నారని అన్నారు. కళాకారులు భౌతికంగా లేక పోయిన వారు పాడిన పాటలు సజీవంగా ఉంటాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారులకు బాసటగా నిలుస్తు న్నారని, సంస్కతిక సారధిని ఏర్పాటు చేసి కళాకారులకు ఉద్యోగ అవకాశాలను కల్పించా రన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కళలకు, కళాకారులకు పుట్టినిల్లని, ఈ ప్రాంతం లోని కళాకారులకు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబర్చి కీర్తి తీసుకు వచ్చా రన్నారు. రామగుండం ప్రాంతంలో ఆడిటోరియం భవనం నిర్మాణం త్వరలో జరుగు తుందన్నారు.
సినీనటులు శివారెడ్డి మాట్లాడుతూ… కళను, కళాకారులను ప్రోత్సహించి ఆదుకునే ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉండటం రామగుండం కళాకారులు అదృష్టమన్నారు. అనతంరం శివారెడ్డి చేసిన మిమిక్రి ఆహుతులను అలరించింది.
ఈ కార్యక్రమంలో నగర డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు అడ్డాల స్వరూప రామస్వామి, దాతు శ్రీనివాస్, కల్వచర్ల కష్ణవేణి-భూమయ్య, బాల రాజ్ కుమార్, జంగపల్లి సరోజన-కనుకయ్య, కో అప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, వంగ శ్రీనివాస్ గౌడ్, మూల విజయరెడ్డి, మాజీ చైర్మన్ జాలి రాజమణి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వంశీ, నాయకులు తానిపార్తి గోపాల్ రావు, దయనంద్ గాంధీ, ర్యాకం వేణు, దుర్గం రాజేష్, తోడేటి శంకర్ గౌడ్, మోతుకు దేవరాజ్, బోడ్డుపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, పీచర శ్రీనివాస్, మండ రమేష్, మారుతి, ఆడప శ్రీనివాస్, కుమార్ నాయక్, అనుముల కళావతి, శాంతలక్ష్మి, కనకలక్ష్మి, కళాకారులు మేజిక్ రాజా, దామోర శంకర్, బోంకురి మధు, ఈదూనూరి పద్మ,దయానర్సింగ్, సందీప్, సర్వేష్ తదితరులు పాల్గొన్నారు.