(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 3: సింగరేణి ఎస్.సి. చీఫ్ లైజన్ ఆఫీసర్, రామగుండం ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్‌ను శనివారం ఇల్లందు అతిధి గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే హక్కులు, సేవలు అందించేందుకు సహాయ సహాకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ జీఎం నారాయణను అభినందించి పూల బొకే, శాలువా కప్పి సన్మానించారు. ఆర్జీవన్ ఏరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమ కార్యక్రమాలు, కరోనా నివారణకు తీసుకున్న చర్యల గురించి జీఎం సుమన్‌కు వివరించారు.