– చెక్కులను అందించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 3: సీఎం సహాయ నిధి నిరుపేద అనారోగ్య బాధితులకు వరంలాంటిదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధి రమేష్‌నగర్‌లో నివాసముండే బండారి కష్ణ మూర్తి రక్తనాళాల (వాస్క్యూలర్) సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తగిన ఆర్థిక స్థితి లేక పోవడంతో శాసన సభ్యులు కోరుకంటి చందర్‌ను కలిసి పరిస్థితి వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే ముందస్తూ చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిది నుండి రూ.2లక్షలు, అలాగే రుద్రోజు ఆనందంకు రూ.లక్షా 50వేలు మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన చెక్కులను శనివారం హైదరాబాద్‌లో బాధితులకు అందించారు.
అనంతరం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద అనారోగ్య బాధితులకు వరంగా సీఎం సహాయ నిధి నిలుస్తుందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయలు సీఎంఆర్‌ఎఫ్, ఎల్.ఓ.సి ద్వారా లబ్దిదారులకు అందజేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కషి చెస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట కార్పోరేటర్లు పాముకుంట్ల భాస్కర్, అడ్దాల గట్టయ్య ఉన్నారు.