(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 3: సింగరేణి ఆర్‌జీ-1 ఏరియాలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి అధికారులతో జీఎం కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కె. నారాయణ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమవేశంలో జియం మాట్లాడుతూ… ఉత్పత్తి, ఉత్పాదకత, 100 శాతం బొగ్గును వెలికితీసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భూఉపరితల, భూగర్బ గనులలో 100 శాతం బొగ్గు ఉత్పత్తికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. నూతన (పాజెక్ట్, ఓవర్ బర్డెన్(మట్టి) తరలింపు, కరోనా నివారణ చర్యలు, అర్జీ-1 ఏరియాలో ప్రతి రోజు 22,000 నుండి 25,000 ఓవర్ బర్డెన్ తొలగించాలని సూచించారు. భూఉపరితల భూగర్బ గనులలో ప్రతి రోజు 7000 నుండి 9000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు.
జీడికే 1 సి.హెచ్.పి నుండి రోజుకు 1.5 రేకుల ద్వారా సగటున నెలకు 45 రేకుల ద్వారా బొగు డిస్పాచ్ చేయాలని అధికారులకు దిశా నిర్థేశం చేశారు. జీడికే11 ఇంక్లైన్ కంటిన్యూస్ మైనర్ ద్వారా త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతున్న దష్ట్యా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. యంత్రాలను సాద్యమైనంతగా వినియోగించు కోవాలని, ఓపెన్‌కాస్ట్-5కు సంబంధించి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, భూసేకరణ పనులు తదితర అనుమతులపై సమీక్షించారు.
సమావేశంలో అధికారులు త్యాగరాజు, బెనర్జీ బెంజ్ మెన్,కె.వి.రావు, సత్యనారాయణ, అప్పారావు వెంకటేశ్వర్ రావు, నవిన్ కుమార్, ఆంజనేయులు, మురళిధర్, మదన్ మోహన్, కాశీ విశ్వేశ్వర్ రావు, వెంకటరమణ, సలీం, అంజని ప్రసాద్, సాయి ప్రసాద్, నెహ్రు, హరినాథ్, సలీం పాల్గొన్నారు.