– మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలపై దృష్టి సారించాలి…
– 100కాల్స్‌పై సత్వరమే స్పందించాలి…
– షీటీం అధికారుల శిక్షణలో అడ్మిన్ అశోక్‌కుమార్ ..
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 3: మహిళల భద్రతలో రాజీ పడేది లేదని, మహిళలు, చిన్నారుల రక్షణకు నిరంతరం పని చేయాలని రామగుండం పోలీసు కమిషనరేట్ డీసీపీ (అడ్మిన్) అశోక్‌కుమార్ తెలిపారు. శనివారం ఎన్టీపీసీ మిలీనియం హల్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా షీ-టీమ్ ఇంచార్జ్ అధికారులకు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా అడ్మిన్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దష్టి సారించాలన్నారు. మహిళల పట్ల జరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్ లైన్ వేధింపులు, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ సంఘటనలు ఎక్కువయ్యాయన్నారు. షీ టీమ్స్ భవిష్యత్ అవసరాల దష్ట్యా అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తా మన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా చిన్నారుల పట్ల జరుగుతున్న అకృత్యాల నివారణకు షీ టీమ్స్‌లు పని చేయాలన్నారు.
షీ టీమ్స్ ఆకతాయిల ఆట కట్టించడమే కాకుండా బాధితుల పక్షాన అండగా నిలబడి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు. డయల్ 100 కాల్స్‌నకు సత్వరమే స్పందించి అక్కడ ఏర్పడిన సమస్య గురించి తెలుసుకుని వెంటనేపై అధికారులకు తెలియజేయాలని సూచించారు. బస్సులు, బస్టాండ్ వద్ద మహిళా పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచాలని సూచించారు. హాక్‌ఐ, టెక్నాలజీ గురించి అవగాహన కల్పించాలన్నారు.
మహిళలు నివాసముండే, ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో నిఘా పెంచాలని సూచించారు. పోలీస్ శాఖ పట్ల మహిళలలో నమ్మకం, గౌరవం పెరిగే విధంగా పని చేయాలి సూచించారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ సిబ్బంది రాత్రి, పగలు, పండుగలు, సెలవులు అనే తేడా లేకుండా పనిచేస్తున్నాయన్నారు. మహిళలకు సమస్యల వుంటే నిస్సంకోచంగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు ఉమేందర్, సిహెచ్. వెంకటేశ్వర్లు, రమణబాబు, జి.వెంకటేశ్వర్లు, సతీష్, నరేష్, శ్రీధర్, మానస, శైలజ, మారుతి, ఇషాక్, చంద్రకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.