(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 15: సింగరేణి సంస్థ ఆర్జీవన్ డివిజన్ జీడీికే-1వ స్టౌవింగ్ బంకర్‌ను జీఎం కల్వల నారాయణ గురువారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న స్టౌవింగ్ పనులను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఇటీవల నిర్మించిన స్టౌవింగ్ వద్ద ఏర్పాటు చేసిన బంకర్ పనితీరును, బోర్ హోల్స్ స్టౌవింగ్ నాణ్యత, సర్పేస్ నుంచి అండర్ గ్రౌండ్‌కు వేసిన పైపుల నాణ్యతను ఆయన పరిశీలించారు.
సర్ఫేస్ నుండి అండర్ గ్రౌండ్‌కు పంపు పైపుల నాణ్యతను ఆయన పరిశీలించారు. గతంలో లాగా స్టౌవింగ్ బంకర్ ప్లాంట్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జీఎం అధికారులకు తెలిపారు. మిని స్టౌవింగ్ ప్లాంట్ నుండి స్టౌయింగ్ ప్లాంట్-1 వరకు నూతనంగా వేసిన వాటర్ పైపు లైను తనిఖీ చేశారు. సర్ఫేస్ నుండి అండర్ గ్రౌండ్‌కు పంపు స్టౌవింగ్ సంబధిత వివరాలను జీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో 1వ గూప్ ఏజెంట్ సురేశ్, మేనేజర్ ఎస్.పి.సింగ్, అధికారి హనుమాన్లు, సెక్యూరిటి అధికారి వీరారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.