Home తెలంగాణ 11వ భూగర్బగనిని సందర్శించిన జీఎం

11వ భూగర్బగనిని సందర్శించిన జీఎం

874
1
GM K.Narayana visit 11 Incline Mine
GM K.Narayana visit 11 Incline Mine

(ప్రజాలక్ష్యం కోల్‌బెల్ట్‌ ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్‌ 14: రామగుండం ఏరియా-1 జీఎం కల్వల నారాయణ, గని ఏజేంట్‌ మనోహర్‌ జిడికె.11వ భూగర్బ గని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా జనరల్‌ మేనేజర్‌ కల్వల నారాయణ జిడికె 11వ భూగర్బనికి సంబంధించిన సమస్యలను పరిశీలించారు. జిడికె.11వ భూగర్బ గనిలోకి జీఎం దిగారు. 1వ సీమ్‌, కంటిన్యూస్‌ మైనర్‌ సెక్షన్‌, బ్లాక్‌-సి, డెవలప్‌మెంట్‌ డిస్ట్రిక్ట్‌లో పని స్థలాలను పరిశీలించారు. వెంటిలేషన్‌, గనిలో చేపట్టిన రక్షణ చర్యలు తదితర విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని, రక్షణ సూత్రాలు పాటించాలని తెలిపారు.ఉద్యోగులు కలిసి కట్టుగా పని చేసి సంస్థ నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలని జీఎం కోరారు. జిడికె.11వ గనిలోని 1వ సీిమ్‌, కంటిన్యూస్‌ మైనర్‌ సెక్షన్‌లోని పనిస్థలాల్లో బురద ఉండటం వలన ఉద్యోగుల సౌకర్యార్థం జీఎం వారికి గమ్‌షూస్‌ అందించారు. ఉద్యోగులు జీఎంకు కృతజ్ఞతలు తెలిపి, సంతోషాన్ని వ్యక్తం చేశారు.

GM and other officers going into the mine by manriding
GM and other officers going into the mine by manriding

గనిలో దిగిన వారిలో జీఎం కల్వల నారాయణ తో పాటు గని ఏజెంట్‌ ఏ.మనోహర్‌, గని ఆక్టింగ్‌ మేనేజర్‌ సురేశ్‌, గ్రూప్‌ ఇంజనీరు బి.రాందాస్‌ వున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here