(ప్రజాలక్ష్యం ప్రతినిధి) :
మంచిర్యాల, సెప్టెంబర్ 28: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా ముల్కల, హాజీపూర్ మండలానికి చెందిన గుడిగే మాలతి సోమవారం ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని గోదావరి రివర్ పోలీసులు, సిబ్బంది గుర్తించి మాలతిని కాపాడారు.
మాలతి భర్త, అతని కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని నా బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి గోదావరి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకడానికి ప్రయత్నించింది. ఆమెను గోదావరి రివర్ పోలీసులు కాపాడి, మాలతి కుటుంబ సభ్యులను రప్పించారు. వారి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి మాలతిని సోదరునికి అప్పగించారు. మాలతిని కాపాడిన గోదావరి రివర్ పోలీసులను పలువురు అభినందించారు.