– 100% సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ
– ప్రాజెక్టులతో పెరుగుతున్న మత్స్యసంపద
– ఫిష్ హబ్‌గా ఆవిర్భవిస్తున్న తెలంగాణ
– రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జగిత్యాల, అక్టోబర్ 18 : ఉచితంగా చేపపిల్లలను పంపిణీ ద్వారా మత్స్యకారుల సమగ్రా భివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం ధర్మపురిలోని గోదావరి నదిలో జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులతో కలిసి 80 నుండి 100 మీల్లీ మీటరు సైజు గల 6.10 లక్షల చేపపిల్లలను, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బాక్ వాటర్ గోదావరినదిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు తీసుకుందని, కులవత్తులను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కషి చేసిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో నివసించే వారికి ఆర్థిక స్వావలంబన దిశగా వ్యవసాయ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.
భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం వల్ల వ్యవసాయ రంగంతో పాటు మత్స్యకారులు అభివద్ధికి సైతం దోహదపడిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీటి వనరులలో 100% సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లలను విడుదల చేస్తున్నామని, నీటి వనరులలో ఉన్న చేప పిల్లలపై స్థానిక మత్స్యకార సంఘాలకు సంపూర్ణ హక్కు కల్పించాలని మంత్రి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ధర్మపురి గోదావరి నది 365 రోజులు నీటితో నిండి ఉంటుం దని, మత్స్యకారులకు దోహదపడే విధంగా చేపపిల్లలను విడుదల చేస్తున్నామని తెలిపారు. మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకత మత్స్య అభివద్ధి పథకం చేపట్టిందని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం మత్స్య సంపదలో మరింత వద్ధి సాధిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా ఉత్పత్తితో పాటు వినియోగం పెరిగిందని అన్నారు. గత ప్రభుత్వాలైతే మత్స్యకారుల అభివద్ధి పై శ్రద్ధ చూపలేదనీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులవత్తులను ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను రూపొందించడం జరిగిందని తెలిపారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందించ డంతో పాటు వారికి అవసరమైన పరికరాలు వాహనాలు నెట్లు సైతం ఉచితంగా అందించామని మంత్రి తెలిపారు.
అంతకుముందు 92.77 లక్షలతో చింతామణి మినీ ట్యాంక్ బ్యాండ్ పునరుద్ధరణ కార్యక్రమ పనులను ప్రారంభించారు. అనంతరం ధర్మపురి లోని చేపల మార్కెట్ ప్రారంభించి, జెడ్పీ హై స్కూల్ కు 150 డ్యూయల్ బెంచిల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రవి, జిల్లా మత్స్యశాఖ అధికారి, సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు