– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 17: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికయిన రామగుండం సంస్కృతిక కళాకారుల సంఘం బాధ్యులు ఎమ్మెల్యేను కలిసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కళాలకు పుట్టినిల్లు అయిన ఈ ప్రాంతం లోని కళాకారులు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని వారి సంక్షేమం కోసం కళాకారుల వెల్ఫేర్ సోసైటిని ఏర్పాటు జరుగుతుందన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అడిటోరి యంను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కళకారులంతా ఒక తాటి పైకి వచ్చి ఏకగ్రీవంగా నూతన కమిటిని ఎన్నుకోవడం సంతోషకరమన్నారు.
రామగుండం సంస్కృతిక కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షలుగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్నుకున్నట్లు సంఘ బాధ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామగుండం సంస్కృతిక కళాకారుల సంఘ అధ్యక్షులు మ్యాజిక్ రాజా, ప్రధాన కార్యదర్శి దామెర శంకర్, అడ్వజరీ కమిటి బాధ్యులు తానిపర్తి గోపాల్ రావు, అమరేందర్, అందె సదానందం, శంకర్, సంకె రాజేష్, ప్రభు, సాంబశివ, తిరుమలేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.