– రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్
(ప్రజాలక్ష్యం విలేకరి)
రామగుండం, అక్టోబర్ 16: అకాల వర్షాలతో తడిసిన పంటలను ప్రభుత్వం కొని రైతులను ఆదుకోవాలని రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ఎంఎస్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ డిమాండ్ చేసారు. ఈమేరకు శుక్రవారం పెద్దపెల్లి జిల్లా అంతర్గాం, పాలకుర్తి మండలాలల్లోని పలు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో వరదలతో మునిగిపోయిన పత్తి, వరి పంటలను ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షంతో ఆరు గాలం కష్టపడి పండించిన పంట నష్ట పోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడి రాకుండా ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన ప్రతి ఎకరాకు సంబంధించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొని, రైతులకు భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం మీడియా ముందుకు వచ్చి వేల కోట్లు ప్రకటిస్తున్నా కానీ క్షేత్ర స్థాయిలో ఒక్క రైతుకు కూడా లబ్ధి చేకూరక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు నానా కష్టాలు పడుతున్నరని తెలిపారు. సంటలను పరిశీలించిన ఆయన రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులతో సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్యాల మహేష్, సూర సమ్మయ్య, గంగాధరి రమేష్, మడ్ది తిరుపతి, గాదె సుధాకర్, లింగమూర్తి, మడసు బరపటి శీను, సంతోష్, నాగరాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, భూం రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కుక్కు ప్రసాద్, వెల్పుల రాజ్ కుమార్, శేఖర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక తోపాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.