Home తెలంగాణ ఆరోగ్యానికి మూలం స్వచ్ఛత…

ఆరోగ్యానికి మూలం స్వచ్ఛత…

342
0
Swachhara pledging
Base workshop employees Swachhara pledging

– ఆర్జీత్రీ జీఎం సూర్యనారాయణ

(ప్రజాలక్ష్యం కోల్ బెల్ట్ ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్‌ 16, ఆరోగ్యంగా జీవించడానికి స్వచ్ఛత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సింగరేణి ఆర్జీత్రీ జీఎం కె.సూర్యనారాయణ అన్నారు. గురు వారం ఓసీపీ-2 బేస్‌ వర్క్‌షాపు ఆవరణలో స్వచ్ఛతా మాసోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా జీఎం మాట్లాడుతూ… దేశ అభివృద్ధి పారిశ్రామికాభివృద్ధిపై ఆధారపడి వుంటుందన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా వుంటేనే సంస్థ పురోభివృద్ధి చెందుతుందన్నారు. కార్మికుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

సీఎన్సీ క్వార్టర్స్‌లో స్వచ్ఛతా కార్యక్రమం

 participating in Swachha Hi seva programme
Employees participating in Swachha Hi seva programme

సింగరేణి ఆర్జీత్రీ పరిధి సెంటినరికాలనీ బంగ్లాస్‌ ఏరియా, ఎన్‌.బి.క్వార్టర్స్‌లో స్వచ్ఛతా హి-సేవా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జీఎం బంగ్లాస్‌, ఎన్‌.బి.క్వార్టర్స్‌ పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఏపీఏ పర్చేజ్‌ ఇంజనీర్‌ పి.డి.సుధాకర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చుట్టూ వున్న చెత్తతో పాటు ముళ్ల పొదలను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని కార్మిక కుటుంబాలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్‌ పీఓ మారుతి, హౌస్‌కీపింగ్‌ కార్మికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here